Siddipet: సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత

సిద్దిపేట జిల్లాలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం ఆరు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో రూ. 5,79,640 నగదు, 10 క్వింటాళ్ల PDS బియ్యాన్ని సీజ్ చేసినట్లు సిద్దిపేట కమిషనర్ అనురాధ తెలిపారు.

Siddipet: సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత
New Update

Cash Seized at Siddipet District: లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీఐలు, ఎస్ఐలు సిబ్బంది, కేంద్ర బలగాలతో కలిసి విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహనాల తనిఖీలు చేసి రూ. 5,79,640/- డబ్బులు, 10 క్వింటాళ్ల PDS బియ్యాన్ని సీజ్ చేశారు.

పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపిన వివరాలు..

* వంటిమామిడి చెక్పోస్ట్ వద్ద 1,50,000/-

* గౌరారం పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీ

76,640/-

* ముస్త్యాల చెక్పోస్టు వద్ద

1,60,000/-

* రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీలలో 1,10,000/-

* హబ్సిపూర్ X రోడ్ వద్ద వాహనాల తనిఖీలలో 83,000/-

* మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ధర్మారం X రోడ్ వద్ద 10 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.

publive-image Cash Seized at Siddipet District publive-image Cash Seized at Siddipet District

#lok-sabha-elections-2024 #siddiept-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe