New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/v1-1-jpg.webp)
Nagarkurnool: వినాయక చవితి వచ్చిందంటే చాలు మండపాల్లో రకరకాల రూపాల్లో గణనాథుడు కొలువు తీరుతాడు. కానీ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో దేశం లోనే ఎత్తైన ఏకశిలా గణపతి కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడి వినాయకుని భక్తులు ఐశ్వర్య గణపతి గా పిలుస్తూ ఉంటారు. 25 అడుగుల ఎత్తు 17 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆవంచ గణపతికి గుండు గణపతి గా కూడా పేరు ఉంది. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం 12వ శతాబ్దం నాటిదిగా చరిత్ర చెబుతోంది.
గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాణిక్య రాజుల్లో ఒకడైన తైలంపురు ఈ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు చనిపోయినందువల ఆలయ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. అప్పటినుంచి ఈ భారీ విగ్రహం ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఆరుబయటే ఉంటుంది. ఆవంచ గణపయ్యను ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్, జయశంకర్ కూడా సందర్శించారు. దీని అభివృద్ధికి కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ విగ్రహం ఉన్న ఆవంచ గ్రామం మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంత ఊరు. అయినా కూడా ఇంతటి విశిష్టం కలిగిన విగ్రహానికి కనీసం నీడను కూడా ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు. తెలంగాణ దేవాదాయ శాఖ ఈ గణేష్ విగ్రహం పై చలవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాజా కథనాలు