Health tips: రాత్రి సమయాల్లో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..!

చాలా మంది రాత్రిళ్ళు సరైన సమయంలో భోజనం చేయకుండా లేట్ నైట్స్ తింటూ ఉంటారు. అలా లేట్ నైట్స్ తినటం వల్ల నిద్రకు భంగం కలగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆకలిగా ఉందని లేట్ నైట్స్ ఏది పడితే అది అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ ఆహారాలు మాత్రం అస్సలు తినకూడదు..

New Update
Health tips: రాత్రి సమయాల్లో ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..!

Health tips: చాలా మంది బిజీగా ఉంది ఆహరం సరైన సమయంలో తీసుకోరు. కొంత మంది రాత్రిళ్ళు లేటుగా భోజనం చేస్తారు. ఇలా సరైన సమయంలో భోజనం చేయకుండా లేట్ నైట్స్ తినడం వల్ల నిద్రకు భంగం కలగడంతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. చాలా మంది పనిలో బిజీగా ఉంది లేట్ నైట్స్ తింటూ ఉంటారు. అలా లెట్ నైట్స్ తినేటప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు దాని వల్ల నిద్రకు భంగం కలిగి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

లెట్ నైట్స్ తినకూడని ఆహారాలు ఇవే

కెఫీన్ పదార్థాలు:  కాఫీ, టీ, చాక్లెట్స్ , ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే వీటిలోని కెఫీన్ అనే పదార్థం మెలుకువగా ఉండేలా చేస్తుంది. అందుకే వీటిని నిద్రపోయే ముందు తీసుకోవడం మానేయాలి.

స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ వీటిని లెట్ నైట్స్ లో తినడం వల్ల అజీర్ణత, గుండెలో మంట వంటి సమస్యలు తలెత్తి నిద్రకు భంగం కలిగిస్తాయి.

నూనెలో వేయించిన ఆహారాలు:  లేట్ నైట్ సమయంలో  ఫ్యాట్ ఫుడ్స్, నూనెలో వేయించిన పదార్థాలు తింటే అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల కడుపులో ఇబ్బందిగా ఉంటుంది.

చక్కెర పదార్థాలు:  రాత్రి సమయాల్లో చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే అవి రక్తంలోని స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఇవి నిద్ర రాకుండా మెలుకువగా ఉండేలా చేస్తాయి.

హెవీ మీల్స్: లేట్ నైట్స్ హెవీ మీల్స్ అస్సలు తీసుకోకూడదు దాని వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణత వంటి ఇబ్బందులు వస్తాయి.

మద్యం: రాత్రుల్లో మద్యం తాగడం వల్ల ముందు మగతగా అనిపించినా, దాని వల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది అలాగే అది నాణ్యత లేని నిద్రకు దారితీస్తుంది.

పడుకునే ముందు ఆకలిగా ఉంటే ఇలా అజీర్ణ సమస్యలకు కారణమయ్యే ఆహారాలు కాకుండా కాస్త లైట్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది. పెరుగు, ఏదైనా పండు, పాలు లేదా కాసిన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచింది.

Also Read: Sleep Deprivation: ఈ విషయాలు తెలుసుకుంటే నిద్ర విషయంలో ఆ తప్పు చేయరు.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..!

Advertisment
తాజా కథనాలు