Mobile: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఒక కామం వస్తువుగా మారిపోయింది. అంతే కాదు కొత్త కొత్త ఫీచర్స్ కోసం లక్షలు ఖరీదు చేసి ఫోన్‌ని కొనుగోలు చేసే వ్యక్తులు ఉంటారు. అయితే ఖరీదైన ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత, దాని భద్రత కూడా చాలా ముఖ్యం. చాలా మంది ఫోన్ కొన్న వెంటనే దాని భద్రత కోసం మంచి కవర్ లేదా పౌచ్ వెతకడం ప్రారంభిస్తారు. ఇది ఫోన్ పై గీతాలు పడకుండా, పగిలిపోకుండా కాపాడుతుంది.అయితే వాస్తవానికి, మొబైల్‌ను సురక్షితంగా ఉంచే ఫోన్ కవర్ లేదా పౌచ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఫోన్ కవర్స్ మరింత నష్టాన్ని కలిగిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము
హ్యాంగ్ అవ్వడం
మొబైల్ కు పౌచ్ వేసినప్పుడు.. అది అన్ని వైపుల నుంచి మూసివేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో, గాలి ప్రవాహం ఆగిపోతుంది. తద్వారా ఫోన్ త్వరగా వేడెక్కడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కొత్త మొబైల్‌లు కూడా హ్యాంగింగ్ సమస్యను ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, కొన్ని ఫోన్‌లలో ఛార్జింగ్ సమస్య కూడా తలెత్తుతుంది. ఫోన్ వేడిగా ఉన్నప్పుడు, దాని ఛార్జింగ్ స్పీడ్ స్లో అవుతుంది.
నెట్‌వర్క్‌లో సమస్య
మొబైల్‌పై మందపాటి పౌచ్ ను ఉంచడం వల్ల హ్యాంగ్ , హీటింగ్ సమస్య మాత్రమే కాకుండా, సెన్సార్‌ను కవర్ చేయడం వల్ల మీకు నెట్‌వర్క్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతే కాకుండా ఫోన్ వేడెక్కడం వల్ల చెవి దగ్గర పట్టుకొని మాట్లాడలేకపోవడం, డేటా స్పీడ్ తగ్గడం తదితర సమస్యలు వస్తాయి.
బ్యాటరీ సమస్య
ఫోన్ వేడెక్కడం బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా ఫోన్ బ్యాటరీ బలహీనంగా మారుతుంది. కవర్ నాణ్యతగా లేకుంటే, అన్ని రకాల బ్యాక్టీరియా అందులో పేరుకుపోయి, మీకు హాని కలిగించడమే కాకుండా, ఫోన్ సెన్సార్లను కూడా దెబ్బతీస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read:Milk Adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా..? తాగారో ఆరోగ్యానికి ముప్పే..! - Rtvlive.com