Nara Lokesh: వారికి అవకాశం కల్పిస్తూ త్వరలో టెట్ నిర్వహించబోతున్నాం: మంత్రి లోకేష్

ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుందని వెల్లడించారు. 

AP: నాయకుడు - ప్రతినాయకుడు.. నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్..!
New Update

Minister Nara Lokesh: నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ విషయంపై ఆయన ట్వీట్ చేస్తూ.. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురుచూశారన్నారు.

Also Read: వైసీపీకి మరో బిగ్ షాక్.. జిల్లా కార్యాలయానికి నోటీసులు..!

కూటమి ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ కి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నానన్నారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుందని వెల్లడించారు.

#nara-lokesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe