సీఎం సలహాదారుడు, మంత్రి కుమారుని నివాసాల్లో ఈడీ దాడులు....!

జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఈడీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. మరోవైపు జార్ఖండ్ ఆర్థిక శాఖ మంత్రి రామేశ్వర్ ఓరాన్ కుమారుడు రోహిత్ ఒరాన్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి.

author-image
By G Ramu
సీఎం సలహాదారుడు, మంత్రి కుమారుని నివాసాల్లో ఈడీ దాడులు....!
New Update

జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఈడీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. మరోవైపు జార్ఖండ్ ఆర్థిక శాఖ మంత్రి రామేశ్వర్ ఓరాన్ కుమారుడు రోహిత్ ఒరాన్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి. మొత్తం 32 ప్రాంతాల్లో దాడులు జరిపినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.

లిక్కర్ కుంభకోణంతో పాటు ధియోఘర్ భూ కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు నిర్వహించినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. రాజధాని జార్ఖండ్ లోని హర్ముతో పాటు దుమ్కా, దియోఘర్ ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు జరిపినట్టు వెల్లడించాయి. ఉదయం నుంచే ఈడీ అధికారులు దాడులు మొదలు పెట్టారు. ఈడీ అధికారులు మొత్తం 12 టీమ్ లుగా విడిపోయి సోదాలు చేసినట్టు చెప్పాయి.

మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సమన్లు పంపిన మూడు రోజుల తర్వాత ఈడీ దాడులు జరగడం గమనార్హం. ఈ నెల 24 ఈడీ విచారణకు హాజరు కావాలని సీఎంను ఈడీ నోటీసుల్లో ఆదేశించింది. అంతకు ముందు ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని హేమంత్ సోరెన్ కు నోటీసులు పంపారు. కానీ ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల నేపథ్యంలో తాను హాజరు కాలేనని వెల్లడించారు.

అనంతరం ఆయనకు ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 14న నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో రాజకీయ లబ్దిని పొందేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను బీజేపీ వినియోగించుకుంటోందని ఆరోపించారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు ఈడీ నోటీసులు పంపించడంపై ఆయన ఫైర్ అయ్యారు. నోటీసులపై తాను లీగల్ గా పోరాటం చేస్తానని ఈడీని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఈడీకి లేఖ రాశారు. మరోవైపు చత్తీస్ గఢ్ లోనూ ఈడీ దాడులు చేసింది. సీఎం

#ed #hemanth-soren #raids #rameshwar-oran #cm-bupesh-bagel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe