టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నుంచి 10 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. By P. Sonika Chandra 01 Aug 2023 in Scrolling టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నుంచి 10 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేత కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంలో తనిఖీలు చేపట్టారు. ట్రాన్స్‌స్టాయ్ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన పలువురి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. రాయపాటి కంపెనీతో పాటు గుంటూరు, హైదరాబాద్ లో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరగుతున్నాయి. మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ పై గురి పెట్టడంతో కలకలం రేగింది. మంగళవారం తెల్లవారు జాము నుంచే రంగంలోకి దిగిన ఈడీ టీమ్స్ ఏకకాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా 15 చోట్లలో ముమ్మరంగా దాడులు జరుపుతున్నారు. ట్రాన్స్ పవర్, టెక్నో ఇన్ఫ్రాటెక్, కాకతీయ క్రిస్టల్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్ అనే నాలుగు కంపెనీల పై ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఈ నాలుగు కంపెనీలకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్ గా ఉన్నారు. దీంతో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆయన ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే మాలినేని సాంబశివరావును ఈడీ టార్గెట్ చేయడం పై కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఏప్రిల్ లో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఫార్మా కంపెనీలపై ఈడీ కొరడా ఝుళిపించింది. నకిలీ, నాసిరకం మందులు తయారు చేస్తున్న కంపెనీల గుట్టును అధికారులు రట్టు చేశారు. ఈ క్రమంలో మొత్తం 18 ఫార్మా కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు. అయితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పటాన్ చెరు, మాదాపూర్ లలోని ఫార్మా కంపెనీలు, ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు సహా మొత్తం 15 చోట్ల అప్పుడు సోదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. పల్స్ ఫార్మా, ఫినిక్స్ టెక్ జోన్ కంపెనీల డైరెక్టర్ల ఇళ్లపైనా అధికారులు దాడులు జరిపారు. నకిలీ మందుల విషయంలో డబ్ల్యూ హెచ్ వో అలర్ట్ చేయడంతో మొత్తం 20 రాష్ట్రాల్లోని 100 కు పైగా కంపెనీలపై రేడ్స్ చేయడం జరిగింది. అయితే చాలా ఫార్మా కంపెనీలు క్యాన్సర్ ను నయం చేసే మందు పేరుతో నాసిరకం మందు తయారు చేస్తున్నారు. ఇక నోయిడాలో తయారైన మందులను వాడి ఉజ్బెకిస్తాన్ లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటతో నకిలీ, నాసిరకం మందుల తయారీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత్ ను డబ్య్లూహెచ్ వో సూచించింది. అప్పటి నుంచి ఫార్మా కంపెనీల పై డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కన్నేసి పెట్టింది. సమాచారం అందినప్పుడు అధికారులు దాడులకు పాల్పడుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి