ED Probe on Paytm: పేటీఎంకు మరో కష్టం.. విదేశీ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తున్న ఈడీ..!

పేటీఎం మరింత కష్టాల్లోకి జారిపోతోంది. ఆర్బీఐ నిషేధాజ్ఞలు విధించిన తరువాత.. ఇప్పుడు ఈడీ అలాగే ఇతర దర్యాప్తు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల వివరాలను సేకరిస్తున్నాయి. దీంతో పేటీఎం పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. 

New Update
ED Probe on Paytm: పేటీఎంకు మరో కష్టం.. విదేశీ ట్రాన్సాక్షన్స్ వివరాలు సేకరిస్తున్న ఈడీ..!

ED Probe on Paytm: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటే ED పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుండి విదేశీ లావాదేవీల వివరాలను కోరింది. దానికంటే ముందుగా  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని ED అడిగింది. కొన్ని వారాల క్రితం, రాయిటర్స్ One97 కమ్యూనికేషన్స్‌పై ED దర్యాప్తు చేస్తోందని రిపోర్ట్ చేసింది.  వన్97 కమ్యూనికేషన్స్‌పై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కేసు నమోదు చేసినట్లు కొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్. Paytm పేమెంట్ బ్యాంక్ దాని అసోసియేట్. జనవరి 31న, RBI నిబంధనలను దీర్ఘకాలికంగా పాటించడం లేదని పేర్కొంటూ Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధించింది.

ఫెమా అంటే ఏమిటి.. ఈ పాయింట్ల నుంచి తెలుసుకుందాం.. 

  • ఇది విదేశీ దేశాల నుండి లావాదేవీలను నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది.
  • FEMA ఆమోదం లేకుండా విదేశీ సెక్యూరిటీస్ లేదా ఎక్స్చేంజ్ కు సంబంధించిన ఏ లావాదేవీ జరగదు.
  • భద్రతా కారణాల దృష్ట్యా, ప్రభుత్వం కరెంట్ ఎకౌంట్ లావాదేవీలు చేయకుండా అధీకృత వ్యక్తిని కూడా ఆపవచ్చు.
  • దీన్ని ఉపయోగించి, ఆర్‌బిఐ క్యాపిటల్ ఎకౌంట్ లావాదేవీలు చేయకుండా అధీకృత వ్యక్తిని ఆపవచ్చు.
  • ఈ చట్టం దేశంలోని భారతీయ నివాసికి విదేశీ కరెన్సీ, విదేశీ భద్రత లేదా విదేశీ దేశంలో స్థిరాస్తి లావాదేవీలు చేయడానికి అధికారం ఇస్తుంది.

ఇతర కస్టమర్ల వివరాలూ..
ఈడీ విదేశీ కస్టమర్లతో పాటు దేశీయ కస్టమర్ల వివరాలు కూడా పేటీఎం బ్యాంకు (ED Probe on Paytm0నుంచి సేకరిస్తోంది. ఈడీ మాత్రమే కాకుండా ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఈ వివరాలు తీసుకుంటున్నాయి. పేటీఎం మాతృసంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థల నుంచి తమ కస్టమర్ల వివరాలు కావాలంటూ నోటీసులు వచ్చినట్టు తెలియచేసింది. తాము అధికారులు అడిగిన సమాచారాన్ని పూర్తిగా వారికి అందిస్తున్నామని వెల్లడించింది. 

Paytmకి వ్యతిరేకంగా RBI ఆర్డర్ ముఖ్యాంశాలు.. 

  • ఫిబ్రవరి 29 తర్వాత, Paytm పేమెంట్ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయడం కుదరదు.  ఈ బ్యాంక్ ద్వారా వాలెట్, ప్రీపెయిడ్ సేవలు, ఫాస్టాగ్ - ఇతర సేవలలో డబ్బు పెట్టడం కుదరదు.  అయితే, వడ్డీ, క్యాష్‌బ్యాక్, రీఫండ్స్ ఎప్పుడైనా ఖాతాలో జమ చేయవచ్చు.
  • ఈ బ్యాంకు ఖాతాదారుల పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ మొదలైన వాటిలో డబ్బును ఉపసంహరించుకోవడం లేదా ఉపయోగించడంపై ఎలాంటి పరిమితి లేదు. బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు దీనిని ఉపయోగించవచ్చు.
  • రెండవ పాయింట్‌లో పేర్కొన్న సేవలు కాకుండా, ఫిబ్రవరి 29, 2024 తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ సేవను అందించడానికి Paytm పేమెంట్ బ్యాంక్ కి అనుమతి లేదు. ఫిబ్రవరి 29 తర్వాత UPI సౌకర్యం కూడా ఉండదు. 
  • One97 కమ్యూనికేషన్స్ - Paytm చెల్లింపుల సేవల నోడల్ ఖాతాలు 29 ఫిబ్రవరి 2024 నాటికి క్లోజ్ అయిపోతాయి.  పైప్‌లైన్‌లోని లావాదేవీలు, నోడల్ ఖాతాల సెటిల్‌మెంట్ మార్చి 15, 2024 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత తదుపరి లావాదేవీలు అనుమతించరు. 

Also Read: వాలెంటైన్స్ డే.. గులాబీల ఎగుమతిలో రికార్డ్.. 

ఏక్కువ మంది  కస్టమర్ల కోసం ఒకే పాన్.. 
Paytm లక్షల మంది కస్టమర్‌ల KYC చేయలేదు. లక్షల ఖాతాల పాన్ ధ్రువీకరణ జరగలేదు. చాలామంది కస్టమర్ల కోసం ఒకే పాన్ ఉపయోగిస్తున్నారు.  చాలా సందర్భాలలో, బ్యాంకు ద్వారా RBI కి తప్పుడు సమాచారం అందించారు. ఆర్‌బీఐ కూడా పెద్ద సంఖ్యలో పాసివ్ ఎకౌంట్స్ ను గుర్తించింది.

కుప్పకూలిన షేర్లు..
నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం షేర్లు పడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తు (ED Probe on Paytm)వార్తలు రావడంతో బుధవారం పేటీఎం షేర్లు మరో 10శాతం పడిపోయాయి. బుధవారం మార్కెట్ ముగిసేసరికి పేటీఎం షేర్ 342 రూపాయల వద్ద ఉంది. 

Watch this Interesting Video:

Advertisment
తాజా కథనాలు