Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈడీ షాక్‌.. మనీలాండరింగ్ కేసు ఛార్జిషీటులో కాంగ్రెస్ నాయకురాలు పేరు!

మనీలాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు హర్యానాలో ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి భూమిని కొనుగోలు చేసి థంపీకి విక్రయించారని ఈడీ పేర్కొంది. వాద్రా, థంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.

New Update
Priyanka Gandhi: ఈ నెల 6న తెలంగాణకు ప్రియాంక గాంధీ

కాంగ్రెస్(Congress) పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఇబ్బందుల్లో పడ్డట్టు అనిపిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూమి కొనుగోలుకు సంబంధించిన కేసులో ప్రియాంక గాంధీ పేరును ఈడీ చార్జ్ షీట్‌లో చేర్చింది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా చార్జిషీటులో చేర్చారు. అయితే ఛార్జిషీటులో ప్రియాంక పేరు, రాబర్ట్ వాద్రా పేరును నిందితులుగా చేర్చలేదు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్’ (పీఎంఎల్‌ఏ)కి సంబంధించిన కేసు ఛార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా రాబర్ట్ వాద్రా(Robert Wadra), ప్రియాంక గాంధీ వాద్రాలు హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెబుతోంది . ఈ ఏజెంట్ ఎన్నారై వ్యాపారి సీసీ థంపికి కూడా భూమిని విక్రయించాడు.


ఇదే మొదటిసారి:
ED ఛార్జ్ షీట్‌లో ప్రియాంక గాంధీ వాద్రాను మొదటిసారిగా ప్రస్తావించారు. సీసీ థంపి, సుమిత్ చద్దాలపై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ప్రియాంక గాంధీ పేరును మెన్షన్‌ చేశారు. రాబర్ట్ వాద్రా, థంపితో పాటు ప్రియాంక గాంధీ కూడా ఫరీదాబాద్‌లో భూమిని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. సంజయ్ భండారీకి సన్నిహితుడైన థంపి, వాద్రా మధ్య ఆర్థిక సంబంధాలపై విచారణలో ఈ విషయం వెల్లడైంది. 2005-2006 మధ్య, రాబర్ట్ వాద్రా ఫరీదాబాద్‌లోని అమీపూర్ గ్రామంలో హెచ్‌ఎల్ పహ్వా ప్రాపర్టీ డీలర్ ద్వారా సుమారు 40.8 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. డిసెంబర్ 2010లో పహ్వాకు తిరిగి విక్రయించాడు. అదేవిధంగా అమీపూర్ గ్రామంలో ఏప్రిల్ 2006లో ప్రియాంక గాంధీ వాద్రా పేరిట ఒక ఇల్లు కొనుగోలు చేసి ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 2010లో పహ్వాకు ఈ ఇంటిని తిరిగి విక్రయించారు. పహ్వా తంపికి చాలా సన్నిహితుడు, అమీపూర్ గ్రామంలో తంపికి చెందిన భూమిని పహ్వా కొనుగోలు చేశాడు.

వాద్రాకు ఏంటి లింక్?
రాబర్ట్ వాద్రా, థంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. వ్యాపారమే కాకుండా ఇద్దరూ కలిసి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఈ కేసు పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి సంబంధించినది. సంజయ్ భండారీపై మనీలాండరింగ్, విదేశీ మారకద్రవ్యంతో పాటు నల్లధనం చట్టాలు, అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు సంస్థలకు భయపడి సంజయ్ భండారీ 2016లో భారత్ నుంచి పరారీ అయ్యాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్నారు. సమాచారం ప్రకారం, తంపి, బ్రిటిష్ పౌరుడు సుమిత్ చద్దాతో కలిసి నల్లధనాన్ని దాచడంలో సంజయ్ భండారీకి సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also Read: తుపానుల మధ్య పిడుగు.. విజయకాంత్ అంటే అంతే మరి!
WATCH:

Advertisment
తాజా కథనాలు