TMC: భూకబ్జా కేసులో కామంధుడు, టీఎంసీ నేతషేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ..!

భూకబ్జా కేసులో సస్పెన్షన్‌కు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ షాజహాన్‌ను ఈడీ అరెస్టు చేసింది. బసిర్‌హత్ జైలులో దర్యాప్తు సంస్థ అధికారులు విచారించిన తర్వాత అరెస్టు చేశారు.సందేశ్‌ఖాలీ గ్రామానికి చెందిన పలువురు మహిళలపై షేక్ షాజహాన్, అతని సహచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

New Update
TMC: భూకబ్జా కేసులో కామంధుడు, టీఎంసీ నేతషేక్ షాజహాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ..!

TMC:  భూకబ్జా కేసులో సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. ప్రస్తుతం అతడు ఉన్న బసిర్‌హత్ జైలులో దర్యాప్తు సంస్థ అధికారులు అతడిని విచారించిన అనంతరం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామంలో భూక బ్జాలకు పాల్పడుతూ...పలువురు మహిళలను బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అరెస్టు చేసింది. కాగా ఫిబ్రవరిలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై షాజహాన్ అనుచరులు దాడులకు పాల్పడ్డారు.

ఈ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు షాజహాన్‌ను అరెస్టు చేశారు . సందేశ్‌ఖాలీలోని ఆయన ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లగా ఈడీ బృందంపై షాజహన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన తర్వాత దాదాపు 55 రోజులపాటు పోలీసులకు చిక్కకుండా షాజహన్ తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, షేక్ షాజహాన్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం బసిర్‌హత్ కోర్టులో వారెంట్‌ను సమర్పించిన తర్వాత షాజహాన్‌ను రిమాండ్‌కు కోరే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  భార్యను ‘పిశాచి’ అనడం క్రూరత్వం కాదు: పట్నా హైకోర్టు

Advertisment
తాజా కథనాలు