BIG BREAKING: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది.

New Update
EC: వాటికి ప్రస్తుతానికి విశ్రాంతినిచ్చి...వచ్చే సారికి మొదలు పెట్టండి...ఈవీఎంల గురించి ఈసీ సెటైర్లు!

Jammu Kashmir Assembly Elections: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలను ఈసీ విడుదల చేయనుంది. జమ్మూ కాశ్మీర్ లోని 90 స్థానాలతో పాటు హర్యానాలోని 90 స్థానాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. కాగా హర్యానాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 4న ఫలితాలు వేలుడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.

మూడు దశల్లో..

  • మొదటి దశకు నోటిఫికేషన్ తేదీ:  28 ఆగస్టు 2024
  • రెండో దశకు నోటిఫికేషన్ తేదీ: 29 ఆగస్టు 2024
  • మూడో దశకు నోటిఫికేషన్ తేదీ: 5 సెప్టెంబర్ 2024

నామినేషన్లకు చివరి తేదీ..

  • మొదటి దశకు: 27 ఆగస్టు 2024
  • రెండో దశకు: 5 సెప్టెంబర్ 2024
  • మూడో దశకు: 12 సెప్టెంబర్ 2024

నామినేషన్ల పరిశీలన..

  • మొదటి దశకు: 28 ఆగస్టు 2024
  • రెండో దశకు: 6 సెప్టెంబర్ 2024
  • మూడో దశకు: 13 సెప్టెంబర్ 2024

నామినేషన్ల ఉపసంహరణకు గడువు..

  • మొదటి దశకు: 30 ఆగస్టు 2024
  • రెండో దశకు: 9 సెప్టెంబర్ 2024
  • మూడో దశకు: 17 సెప్టెంబర్ 2024

ఎన్నికలకు పోలింగ్..

  • మొదటి దశకు: 18 సెప్టెంబర్ 2024
  • రెండో దశకు: 25 సెప్టెంబర్ 2024
  • మూడో దశకు: 1 అక్టోబర్ 2024

ఎన్నికల ఫలితాలు: అక్టోబర్ 4, 2024

Advertisment
Advertisment
తాజా కథనాలు