రేవంత్ సర్కార్ కు ఈసీ గుడ్ న్యూస్

తెలంగాణలోని రేవంత్ సర్కార్ కు ఈసీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో జూన్ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది ప్రభుత్వం.

New Update
రేవంత్ సర్కార్ కు ఈసీ గుడ్ న్యూస్

తెలంగాణలోని రేవంత్ సర్కార్ కు ఈసీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో జూన్ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది ప్రభుత్వం. ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అనుకుంటున్న షెడ్యూల్ ప్రకారం.. జూన్‌ 2న తొలుత సీఎం రేవంత్‌రెడ్డి గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమకారులు, కవులు గాయకులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులను సైతం ఆహ్వానించి వారిని సన్మానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాట రికార్డింగ్ ను ప్రభుత్వ సంగీత దర్శకుడు కీరవాణికి ప్రభుత్వం ఇప్పటికే అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పాటను సైతం అదే రోజు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ ప్రణాళిక రూపొందిస్తోంది.

Advertisment
తాజా కథనాలు