PaaniPuri: మీకు పానీపూరీ అంటే ఇష్టమా..? అయితే ఇది చదవాల్సిందే!

మన దేశంలో చాలామంది ఎక్కువగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ. పానీపూరీలో ఉపయోగించే పానీలో జీలకర్ర, కొత్తిమిర, కారం, పచ్చిమిర్చి, చింతపండు వేస్తారు. ఈ నీరు తాగితే జీర్ణక్రియ, ఎసిడిటీ కంట్రోల్, బరువు నియంత్రణ, పోషకాలు లాంటివి లభిస్తాయి.

New Update
PaaniPuri: మీకు పానీపూరీ అంటే ఇష్టమా..? అయితే ఇది చదవాల్సిందే!

PaaniPuri: మన దేశంలో అందరూ ఎక్కువగా ఇష్టపడే ఒకే ఓ స్ట్రీట్ ఫుడ్ అంటే పానీ పూరీ అనే చెప్పాలి. దీనిని ఉన్న నుంచి పెద్దల వరకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇందులో ఉపయోగించే పచ్చి బఠానీ, ఆనీయన్, ఆలుగడ్డ, చింతపండు, మసాల నీరు వంటి వాటితో కరకరలాడే పూరీని తాయారు చేస్తారు. అంతేకాదు దీనిని వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అయితే.. దీనిని వివిధ పాంత్రాలల్లో వేర్వేరుగా పేర్లు ఉన్నాయి. కొందరూ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని,  రోడ్డు పక్కన పెట్టడం వలన అశుద్ధ ఆహారం అని, రోగాలు వస్తాయని కొందరూ అంటూ ఉంటారు.

అయితే.. దీనిని ఇంట్లో తయారు చేసుకుని, శుభ్రమైన ప్రదేశాలలో తయారు చేస్తే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పానీ పూరీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని డాక్టర్లు అంటున్నారు. భారతదేశంలో ఎక్కువగా దొరికే ఈ పానీపూరి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల రుచులతో కనిపిస్తుంది. తీపి, కారం, పులుపు లాంటి విభిన్న రుచులతో పానీపూరీ లభిస్తోంది. అయితే.. పానీ పూరీని విరిగిపోకుండా అలానే తినడం ఒక కళా అని అంటారు. అయితే.. పానీ పూరీ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జీర్ణక్రియ మెరుగు

  • పానీపూరీలో ఉపయోగించే పానీలో జీలకర్ర, కొత్తిమిర, కారం, పచ్చిమిర్చి, చింతపండు వంటి వేయటం వలన ఆ పానీ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు ఉంటే ఈ పానీ బెస్ట్.

ఎసిడిటీ కంట్రోల్:

  • పానీ పూరీలో వేసే జీలకర్ర, పుదీన, కొత్తిమేర లాంటి పదార్థాలు బలమైన యాంటీ ఇన్‌ప్లమేటరీ, గుణాలను ఉన్నందున ఎసిడిటీని, దాని వలన వచ్చే అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు నియంత్రణ:

  • బరువు తగ్గాలంనే వారికి పానీ పూరీ బెస్ట్. దీనిలో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉండటం వలన జీర్ణ క్రీయకు ఉపయోగపడుతుంది. అంతేకాదు..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

పానీపూరీ తయారీ

  • ఆవిరి మీద ఉడికించిన పానీ పూరీని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే.. స్టఫ్ కోసం మొలకెత్తిన పెసలు, బటనీలు, శెనగలు వాడుకోవచ్చు. పుల్లటి చింతపండు, నిమ్మకాయలకు బదులుగా జీలకర్ర నీరు వాడితే ఆరోగ్యానికి మేలు.

పోషకాలు

  • నమ్మడానికి విడ్డూరంగా ఉంటే పానీ పూరీలో అధిక పోషకాలున్నాయి. ఇందులో మోగ్నిషియం, పొటాషియం, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు ఉంటే పానీపూరీతో కొద్దీగా విముక్తి లభిస్తుంది.

ఇది  కూడా చదవండి: అనేక వ్యాధులకు చెక్‌ పెట్టే పసుపు.. పెయిన్ కిల్లర్ కూడా ఇదే.. ఇలా వాడి చూడండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు