Rajasthani Recipe: వేసవిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినాలి.. ఈ ఆనియన్ కర్రీ గురించి తెలుసుకోండి !

వేసవిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినాలి. రాజస్థానీ ఉల్లిపాయ కూర ఒక రుచికరమైన ప్రధాన వంటకం. ఇది అన్నం, రోటీలో రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ కూర చేయడానికి సులభమైన వంటకం గురించి తెలుసుకోవాంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.

Rajasthani Recipe: వేసవిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినాలి.. ఈ ఆనియన్ కర్రీ గురించి తెలుసుకోండి !
New Update

Rajasthani Recipe: రాజస్థానీ ఉల్లిపాయ కూర ఒక రుచికరమైన ప్రధాన వంటకం. ఇది అన్నం, రోటీతో రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ కూర చేయడానికి సులభమైన వంటకం . రాజస్థాన్ ప్రసిద్ధ ఉల్లిపాయ కూరగాయలను ఆస్వాదించండి దాని సులభమైన వంటకాన్ని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కావల్సిన పదార్ధాలు:

500 గ్రాముల ఉల్లిపాయలు, 2 టమోటాలు, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ అల్లం పేస్ట్, 2 పచ్చిమిర్చి, 1 టీస్పూన్ ఎర్ర కారం, రుచికి తగిన ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, ధనియాల పొడి కొద్దిగా, పసుపు పొడి, 1 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు.

తాయరీ విధానం:

ముందుగా ఉల్లిపాయను కచ్ చేసి రెండు సమాన భాగాలుగా విభజించాలి. టొమాటోలను కట్ చేసి మెత్తని పేస్ట్‌లా చేయడానికి బ్లెండ్ చేయాలి. తరువాత బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచం మగ్గిన తరువాత టొమాటో ప్యూరీ, మసాలా దినుసులు వేసి నూనె పైకి వచ్చే వరకు ఉడికించాలి. దీని తర్వాత ఉల్లిపాయ వేసి బాగా కలపి 5 నిమిషాలు ఉడికించాలి. తరువాత పెరుగు వేసి బాగా కలిపి 10 -12 నిమిషాలు ఉడికించాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. రోటీ లేదా అన్నంతో వేడిగా సర్వ్ చేసుకోవలంటే.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఆస్తమాలో నాలుగు దశలు.. ఇది చాలా ప్రమాదకరం!

#rajasthani-recipe
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి