అప్పుడు "ఢీ".. ఇప్పుడు ఈటల, జితేందర్‌ "భేటీ"..?

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తినకు చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇస్తారంటూ పార్టీలో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించిన జితేందర్‌ రెడ్డి మాత్రం బండి సంజయ్ హస్తినకు వెళ్లగానే తమ పార్టీ నేతలతో తన ఫాంహౌస్‌లో బీజేపీ నేతలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై ప్రస్తుతం పొలిటికల్‌లో ఆసక్తికరంగా మారింది.

అప్పుడు "ఢీ".. ఇప్పుడు ఈటల, జితేందర్‌ "భేటీ"..?
New Update

telangana-hyderabad-bjp-leaders-lunch-meeting-etala-jitendar-pvch

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం హస్తినకు చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటూ ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించిన జితేందర్‌ రెడ్డి బండి సంజయ్ హస్తినకు వెళ్లగానే తమ పార్టీ నేతలతో తన ఫాంహౌస్‌లో బీజేపీ నేతలతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఈ లంచ్ మీటింగ్‌కు బీజేపీ కీలక నేతలంతా హాజరవడం మరింత ఆసక్తికరంగా మారింది.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ‌తో పాటు జితేందర్ రెడ్డి నివాసానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ తాజాగా ఒకరిపై మరొకరు పరోక్ష విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు వీరిద్దరి భేటీ కావడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్‌మెంట్ అవసరమంటూ ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పెను దుమారాన్నే రేపారు.

ఓ చిన్న వీడియో ద్వారా తెలంగాణ నాయకత్వంపై జితేందర్‌రెడ్డి తన అసంతృప్తినంతా వెళ్లగక్కారు. అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. వెంటనే అది ట్రాలీ ఎక్కుతుంది. సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా అవసరమని జితేందర్ రెడ్డి ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై ఈటల ఫైర్ అయ్యారు. కాగా.. నేడు బండి సంజయ్ హస్తనకు వెళ్లగానే జితేందర్ రెడ్డి లంచ్ మీటింగ్ నిర్వహించడం దానికి ఈటల హాజరవడం ఆసక్తికరంగా మారింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe