Midnight Eat Food: అర్ధరాత్రి ఆకలేస్తే ఈ ఆహారాలు తినండి.. ఆరోగ్యానికి మంచిది

రాత్రి సమయంలో ఆయిల్, మసాలా లాంటి ఫుడ్స్‌ తినకుండా.. తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లను తింటే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందుతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

New Update
Midnight Eat Food: అర్ధరాత్రి ఆకలేస్తే ఈ ఆహారాలు తినండి.. ఆరోగ్యానికి మంచిది

Midnight Eat Food: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి ఆహారం తినడం అనేది అందరికీ సాధ్యం కాని పని. అయితే.. కొందరు సమయం సందర్భం లేకుండా ఆహారం తింటారు. మరి కొందరికి మధ్యరాత్రి ఆకలే ఈ సమయంలో ఏవి పడితే అవి తినేస్తారు. ఇలా ఓ టైమ్‌ అనేది లేకుండా తింటే నిద్రకూ ఆటంకంతోపాటు గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలు వస్తామని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కాలంటే కొన్ని ఆహారపుటలవాట్లతోనే ఇది సాధ్యం అవతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మధ్య రాత్రి మధ్యరాత్రి ఆకలేసిన్నప్పుడు తింటే ఏం అవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: బ్లాక్ ఫుడ్స్ అంటే ఏంటి.. మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి.?

రాత్రి సమయంలో ఆయిల్, మసాలా లాంటి ఫుడ్స్‌ తినకుండా తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లను రాత్రిపూట తింటే శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అందుతాయి. దీంతో నిద్ర బాగా పటి మంచి ఆరోగ్యంగా ఉంటారు. పిస్తాపప్పు నిద్రకు సాయపడే మెలటోనిన్‌ పుష్కలం. దీనిలో ఉంటే ప్రొటీన్లు హాయిగా నిద్రపోయేలా చేస్తుంది. రాత్రి పూట గుమ్మడి గింజలల్లో కొద్దిగా ఉప్పు, దాల్చినచెక్కపొడి కలిపి తింటే నిద్ర చక్కగా పట్టేస్తుంది. అయితే.. ఈ గింజల్ని ఎక్కువగా తిన కూడదు. టొమాటో ముక్కలు, కొద్దిగా చీజ్‌ ఉంచిన బ్రెడ్‌ శాండ్‌విచ్‌ తిన్న అర్ధరాత్రి మెలకువ రాదు. ఎందుకంటే టొమాటోలో ఉండే మెలటోనిన్‌.. నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. చిలగడదుల్లో పీచు, ప్రొటీన్లు శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తూనే. వీటిని ఉడికించుకుని తింటే పొట్ట నిండి మంచి నిద్రకు ఉపయోగపడతుంది.

రాత్రి సమయంలో పండ్లు తింటే మంచి ఫలితం

రాత్రి సమయంలో నానబెట్టిన బాదం గింజలని పడుకునే ముందు తింటే చక్కటి నిద్ర పట్టేస్తుంది. వీటిల్లో ఉండే ఫైబర్‌, ప్రొటీన్‌, క్యాల్షి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. డార్క్‌చాక్లెట్‌ ముక్కని తిన్న మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఓట్స్‌ని పెరుగులో నానబెట్టి కొన్ని పండ్లముక్కలు, గింజలను కలిపి రాత్రి సమయంలో తింటే పొట్ట నిండి మంచి నిద్ర పడుతుంది. ఇంకా పండ్లు తిన్న రాత్రి సమయంలో మంచి ఫలితం ఉంటుంది. కానీ.. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే మంచి డాక్టర్‌ సలహాలు పటించటం ఉత్తమం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు