యాపిల్స్ ఇలా.. తినండి బరువు తగ్గండి!

సంవత్సరం మొత్తం దొరికే పండ్లలో యాపిల్స్ కూడా ఒకటి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కరగని ఫైబర్‌తో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి ఇదో అద్భుతమైన ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

యాపిల్స్ ఇలా.. తినండి బరువు తగ్గండి!
New Update

యాపిల్స్‌లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి ఆకలిని అరికడతాయి. దీని కారణంగా జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉంటాం. బరువు తగ్గాలనుకున్నవారు. వీటిని తీసుకుంటే అవసరమైన అన్నీ పోషకాలు అందుతాయి. అయితే, వీటిని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకోండి.

ఉదయాన్నే యాపిల్స్‌ని కొద్దిగా చీజ్, పీనట్ బటర్‌తో కలిపి తినొచ్చు. చీజ్ మరీ ఎక్కువగా వద్దు. అదే విధంగా, వీటిని ఓట్స్‌తో కలిపి తినొచ్చు. రోజూవారి బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువగా తినరు. ఇందుులోని పోషకాలు రోజుకి కావాల్సిన శక్తిని అందిస్తాయి. వీటిని స్మూతీస్, పుడ్డింగ్‌లో కలిపి తీసుకోవచ్చు.

వీటిని మీరు మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. కేలరీలు తీసుకునే టైమ్‌లో వాటి బదులు వీటిని తీసుకుంటే కేలరీల పరిమాణాన్ని తగ్గించినవారవుతారు. పల్యా, చట్నీల్లా , టర్కీ, ఆపిల్స్ శాండ్‌విచ్‌లా చేసుకుని తీసుకోవచ్చు.వీటిని డెజర్ట్స్‌లా కూడా తీసుకోవచ్చు. సాధారణంగా స్వీట్స్ చేసేటప్పుడు పంచదార వేస్తారు. అయితే, పంచదారతో బరువు పెరుగుతారు. కాబట్టి, దాని బదులు యాపిల్ గుజ్జు వేస్తే రుచితో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి. కాబట్టి, కొలెస్ట్రాల్ పెరగడం లాంటిది ఉండదు. దీనిని పిజ్జా వంటి ఫుడ్స్‌పై టాపింగ్‌లా కూడా తీసుకోవచ్చు.

మీరు ఈ యాపిల్స్‌ని భోజనానికి ముందు తినడం వల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు. ఈ యాపిల్స్ కారణంగా శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. అయితతే, ఇందులో కరగని ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అనవసరంగా ఎక్కువగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరువు తగ్గుతారు.

#health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe