టోంగా, ఫిజీలను వణికించిన భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.2తీవ్రతో ప్రకంపనలు.!! By Bhoomi 16 Jun 2023 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి ఫిజీ, టోంగాలను భూకంపనలు వణికించాయి. రాత్రి 11గంటలకు బలమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదు అయ్యింది. అయితే ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టం గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అర్థరాత్రి సంభవించిన భూకంపం ధాటికి ఫిజీ వణికిపోయింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. గురువారం రాత్రి 11:36 గంటలకు ఫిజీ దీవుల్లోని దక్షిణ భాగం ప్రకంపనలకు గురైనట్లు భూకంప పర్యవేక్షణ సంస్థ నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 210 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. టొంగాలో భూప్రకంపనలు: యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో శుక్రవారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. యూఎస్ జిఎస్ ప్రకారం భూకంప కేంద్రం టోంగాకు నైరుతి దిశలో 167.4కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం తర్వాత యూఎస్ వెస్ట్ కోస్ట్ బ్రిటిష్ కొలంబియా , అలస్కాకు సునామీ ముప్పులేదని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ కూడా ఆస్ట్రేలియా ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో భూకంపం ప్రకంపనలు: గురువారం, ఫిలిప్పీన్స్ రాజధాని నైరుతి ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 'యుఎస్ జియోలాజికల్ సర్వే' ప్రకారం, ఉదయం హుక్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి దాదాపు 120 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి