/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-07T182705.111-jpg.webp)
Alzheimer's disease: సాధారణంగా అల్జీమర్స్ వ్యాధి 50-60 ఏళ్ళ వయసు పై బడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి మెదడుకు సంబంధించిన సమస్య కాల క్రమేన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. సమస్య తీవ్రం అయ్యే కొద్దీ.. చిన్న చిన్న పనులు కూడా చేసుకునే సామర్త్యాన్ని కోల్పోతారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య 24 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. 65 ఏళ్ల వయసు పై బడిన వారిలో 10 మంది.. 85 ఏళ్ల వయసు పై బడిన 3 వ వంతు మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి ప్రారంభంలో కనిపించే లక్షణాలు ఇవే... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
అల్జీమర్స్ వ్యాధి సంకేతాలు
మాట్లాడలేకపోవడం
ఈ సమస్య ఉన్నవారు.. వారి ఆలోచనను సరిగ్గా చెప్పలేకపోతుంటారు. మాట్లాడేటప్పుడు తడబడడం, సరైన పదాలు రాక ఇబ్బంది పడడం చేస్తుంటారు. అలాగే ఒకే విషయాన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పడం, మాటల మధ్యలో అవసరం లేని పదాలు వాడుతూ ఉంటారు.
మూడ్ స్వింగ్స్
అల్జీమర్స్ తో బాధపడేవారిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతీ చిన్న విషయానికి కోపం, చిరాకు, బాధను ఇలా రకరకాల ఎమోషన్స్ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సంకేతాలు అల్జీమర్స్ వ్యాధికి సంకేతాలు.
సమస్యలను పరిష్కరించలేకపోవడం
చిన్న చిన్న వాటిని కూడా సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. గతంలో చాలా సింపుల్ గా పరిష్కరించిన సమస్యలను కూడా పరిష్కరించడం కష్టంగా మారుతుంది. అల్జీమర్స్ కారణంగా మెల్లిగా వారి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ వస్తుంది. దాని కారణంగా ఇలా జరుగుతుంది.
Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి
నిర్ణయాలు తీసుకోలేకపోవడం
సాధారణంగా ఈ సమస్య ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వెంట వెంటనే డెసిషన్స్ మారుస్తుంటారు. ఏదో ఒక కన్ఫ్యూషన్ లో ఉంటారు. గ్రాడ్యువల్ గా మెమొరీ తగ్గిపోవడంతో.. రీసెంట్ గా జరిగిన విషయాలు కూడా గుర్తు పెట్టుకోలేకపోతారు.
సమయాన్ని మర్చిపోవడం
అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు కొన్ని సార్లు సమయం, మనుషులను కూడా గుర్తించడంలో ఇబ్బంది పడతారు లేదా మర్చిపోతుంటారు. తరుచుగా ఎక్కడైనా వస్తువులు పెట్టి మర్చిపోవడం, కొంత మంది బయటకు వెళ్ళినప్పుడు దారి మర్చిపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే త్వరగా వైద్యులను సంప్రదించడం మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.