/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/EAPCET-Counselling.jpg)
EAPCET Counselling:తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయింది. ఈరోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. https://tgeapcet.nic.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఈఏపీసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించినట్లు ఆయన చెప్పారు. వీళ్లంతా కౌన్సెలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.