Srikakulam: శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్య వాణికి దువ్వాడ శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. తను ఉంటున్న ఇంటిని దువ్వాడ మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. దువ్వాడ ఉంటున్న ఇల్లు నాదే అంటూ దివ్వెల మాధురి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు బయటపెట్టింది. దీంతో ఇంటి దగ్గర బంధువులతో కలిసి దువ్వాడ వాణి ఆందోళన చేపట్టింది. సీసీ కెమెరాలు పగలగొట్టి, తలుపు ధ్వంసం చేసింది. మాధురికి ఇంట్లో ఉంటే హక్కు లేదని నిరసన చేపట్టింది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
Also Read: హత్యకు కారణమైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. దారి కాచి మరి..!
ఇలా ఇంటి దగ్గర మళ్లీ రచ్చ మొదలైంది. మరోవైపు ఇంట్లోకి దువ్వాడ వాణి వెళ్లొచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర్వుల్ని టెక్కలి పోలీసులకి ఇచ్చిన దువ్వాడ వాణి.. పోలీసులతో కలిసి దువ్వాడ ఇంటికొచ్చింది. అయితే, వారిని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఇంటి బయట దువ్వాడ భార్య, కూతుళ్లు గొడవకి దిగారు. దువ్వాడ ఇంటికి చేరుకుంటున్న బంధువులు వాణిని, కూతుళ్లను ఇంట్లోకి రానివ్వాలంటూ ఆందోళన చేపట్టారు. ఇంటి బయట భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.