Jio, Airtel, Vodafone, Idea కస్టమర్‌లకు OTT సబ్‌స్క్రిప్షన్ కోసం అనేక ప్లాన్‌లను అందిస్తున్నాయి. కానీ అదే సమయంలో,టెలికాం టారిఫుల్ పెంచటంతో BSNL ఫ్లాన్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.అయితే ఇప్పుడు తాజాగా BSNL OTT నుంచి తక్కువ వ్యయంలో అనేక ప్లాన్‌లను కూడా అందిస్తుంది.
BSNL..ఓటీటీ ప్లాన్ ప్రారంభ ధర రూ. 49 గా ఉంది. ఈ ప్లాన్ పేరు BSNL సినిమా ప్లస్. ఈ రూ. 49 ప్లాన్‌లో.. షెమరూ, హంగామా, లయన్స్‌గేట్,EPIC ఆన్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాలు ఇవ్వబడ్డాయి. కస్టమర్‌లు తమ PC, ల్యాప్‌టాప్, మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ టీవీలో సినిమా ప్లస్ ప్లాన్‌లో లభించే OTT యాక్సెస్ లను పొందవచ్చు.BSNL 119- BSNL ఈ రూ. 119 ప్లాన్‌లో, ZEE5 ప్రీమియం, SonyLIV ప్రీమియం, YuppTV డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనాలు ప్రవేశపెట్టింది. అంతేకాకుండా BSNL రూ.249తో ఓటీటీ ఆఫర్ ను తీసుకువచ్చింది.
BSNL రూ. 249 ప్లాన్‌లో కస్టమర్‌లకు Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, Sony LIV ప్రీమియం, YuppTV, Shemaroo, Hungama, Lionsgate, Disney లో సినిమాలను చూడవచ్చు. అన్ని OTTల కోసం ఎంచుకున్న ప్లాన్ మెంబర్‌షిప్ BSNL ఫైబర్ కనెక్షన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యాక్టివేట్ చేయబడుతుంది. వినియోగదారు బిల్లుకు చందా రుసుము వసూలు చేయబడుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది.
ఇవి సినిమా ప్లస్ ప్లాన్ ప్రయోజనాలు..
మంచి విషయం ఏమిటంటే, కస్టమర్‌లు తమ PC, ల్యాప్‌టాప్, మొబైల్, టాబ్లెట్, స్మార్ట్ టీవీలో సినిమా ప్లస్ ప్లాన్‌లో లభించే OTT ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని OTTల కోసం ఎంచుకున్న ప్లాన్ మెంబర్‌షిప్ BSNL ఫైబర్ కనెక్షన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యాక్టివేట్ చేయబడుతుంది. వినియోగదారు బిల్లుకు చందా రుసుము వసూలు చేయబడుతుంది.