Ravana: వాళ్లకి రావణుడే దేవుడు.. ఎక్కడో తెలుసా..?

రావణ దహనం ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయడమేనంటున్నారు మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలి జిల్లాలోని కోడిశలగూడెం ఆదివాసీలు. రావణుడు గొప్ప శివభక్తుడని, వేదాలను అధ్యయనం చేసిన గొప్ప విద్యావేత్త అని అంటున్నారు. రావణబ్రహ్మని తాము కొలుస్తామని చెబుతున్నారు. దసరా పర్వదినాల్లో 11 రోజుల పాటు కఠోర ఉపావాస దీక్ష చేసి రావణాసురిడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వీరి ఆనవాయితీ కూడా.

New Update
Ravana: వాళ్లకి రావణుడే దేవుడు.. ఎక్కడో తెలుసా..?

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా(Dussehra). మహిషాసురుడితో 9 రోజుల పాటు భీకర యుద్ధం చేసిన అమ్మవారు.. విజయదశమి రోజున ఆ అసురుడిని సంహరించారు. ఇదే విజయదశమి రోజున శ్రీరాముడు రావణాసురుడిని వధించాడు. అందుకే.. విజయదశమి రోజున రావణ దహన వేడుకలకు జరుపుకుంటుంటారు. అయితే.. లంకాధీశుడైన రావణుడి(Ravana)ని కూడా పూజించే వారు ఉన్నారన్న విషయం మీకు తెలుసా..? అదీ రాముడిని ఆరాధించే ఈ పవిత్ర భారతావనిలో అన్న విషయం మీకు తెలుసా..? యస్‌.. మీరు విన్నది నిజమే. ఇంతకీ రావణుడు పూజలందుకుంటున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది..? ఇప్పుడు తెలుసుకుందాం.

రావణాసురిడికి ప్రత్యేక పూజలు:
మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలి జిల్లాలోని కోడిశలగూడెం ఆదివాసీల ఆరాధ్య దైవం రావణాసురుడు. ఇక్కడి ప్రజలు తమను తాము రావణుడికి వారసులుగా భావిస్తారు. రావణబ్రహ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దసరా పర్వదినాల్లో 11 రోజుల పాటు కఠోర ఉపావాస దీక్ష చేసి రావణాసురిడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వీరి ఆనవాయితీ. విజయదశమి రోజున యావత్‌ దేశమంతటా.. రావణ దహన వేడుకలు జరుగుతుంటాయి. కానీ.. ఇక్కడి ఆదివాసీలు మాత్రం రావణ దహనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇలా రావణ దహనం చేయడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనని అంటారు.

రావణుడి దహనానికి వ్యతిరేకం:
ఇక.. రావణుడు గొప్ప శివభక్తుడని, వేద వేదాంగాలను అధ్యయనం చేసిన గొప్ప విద్యావేత్త అని అంటారు ఇక్కడి ఆదివాసీలు. సీతాపహరణ చేసిన రావణుడు ద్రోహి అయితే.. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరహణ చేసిన వారిని ఏమనాలి అని ప్రశ్నిస్తున్నారు. సీతాదేవిని రావణుడు కనీసం తాకనైనా తాకలేదని, ఆమె పాతివ్రత్యానికి ఎలాంటి భంగం కలింగించలేదని అంటున్నారు. రావణాసురుడు గొప్ప శివభక్తుడని,.. వేద వేదాలను అధ్యయనం చేశాడని, అలాంటి మహనీయుడిని విజయదశమి రోజున దహనం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆదివాసీలు. రావణదహన వేడుకలను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం గడ్చిరోలీలోనే కాదు.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు సైతం రావణాసురుడిని తమ ఆరాధ్య దైవంగా పూజిస్తుంటారు.

Also Read: దుర్గా మాత నుంచి ఇవి నేర్చుకుంటే మీకు లైఫ్‌లో అన్నీ విజయాలే!

Advertisment
తాజా కథనాలు