Dussehra 2023: దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే పండుగకు కేవలం ఆనందం కోసమో, వినోదం కోసం, లేకపోతే దేవత కోసమో సెలబ్రేట్ చేసుకుంటే అది పండుగ పరమార్థం కాదు. ఏ పండుగ వచ్చినా ఆ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. వారి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అప్పుడే ఆ గాడ్ కూడా ఆనందిస్తాడు. ముఖ్యంగా చిన్నపిల్లలు దేవుడిని కేవలం పూజించడమే కాకుండా వారి నుంచి మంచి విషయాలు తెలుసుకోని వాటిని ఫాలో అవ్వాలి. దుర్గా మాత (Durga mata) నుంచి మనం ఏ నేర్చుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
ధైర్యం: దుర్గ మాత ధైర్యానికి చిహ్నం. సవాళ్లను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని ఆమె మనకు నేర్పుతుంది.
Also Read: Sleep Tips - రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే జరిగేది ఇదే..!
పట్టుదల: మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడిని పోరాడే దుర్గ కథ కష్టాలను ఎలా ఎదుర్కొవాలో నేర్పుతుంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని, ఎవర్నైనా ఓడించగలమని చెబుతుంది.
రక్షణ: దుర్గ మాత అమాయకులకు రక్షకురాలిగా కనిపిస్తుంది. అవసరమైన వారిని రక్షించడం, వారితో నిలబడడం అనే విలువను దుర్గమ్మ మనకు నేర్పుతుంది.
మహిళల సాధికారత: దుర్గ ఒక బలమైన స్త్రీ దేవత. ఆమె ఆరాధన అనేది స్త్రీకి సంబంధించిన వేడుక. ఇది మహిళలకు సాధికారతకు మూలం. లింగ సమానత్వంలో ఒక పాఠం కావచ్చు.
ఐక్యత: దుర్గ ఒక ఏకం చేసే శక్తి. వివిధ దేవతలను ఒకచోట చేర్చింది. ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఐక్యత ప్రాముఖ్యతను దుర్గ మాత మనకు బోధిస్తుంది.
చెడుపై మంచి విజయం: మహిషాసురునిపై దుర్గ సాధించిన విజయం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఎప్పటికైనా ధర్మం, న్యాయమే గెలుస్తుందని గుర్తుపెట్టుకోండి.
అహంకార వినాశనం: దుర్గ తన ఉగ్రరూపంలో అహంకారాన్ని నాశనం చేస్తుంది. మనం ఎన్ని విజయాలు సాధించిన వినయంగానే ఉండాలని ఆ తల్లి మనకు చెబుతుంది.