Eluru: భర్తతో కాపురం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని వివాహిత నిరసన దీక్ష..! ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దుర్గా భవాని అనే వివాహిత నిరసన దీక్ష చేపట్టింది. తన భర్తతో కాపురం చేయనివ్వకుండా అత్తమామలు, ఆడపడుచు అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగింది. తనను ఆషాఢ మాసం పేరు చెప్పి పుట్టింట్లో వదిలేసి మళ్ళీ అత్తారింటికి తీసుకువెళ్లడం లేదని వాపోతుంది. By Jyoshna Sappogula 19 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Wife Protest: భర్త కోసం భార్య పోరాడుతున్న సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. తన భర్తతో కాపురం చేయనివ్వకుండా అత్తమామలు, ఆడపడుచు అడ్డుకుంటున్నారని వివాహిత రోడ్డెక్కింది. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి గ్రామనికి చెందిన దుర్గా భవాని ఆందోళనకు దిగింది. తనకు గత సంవత్సరం మేలో అమ్మపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయులుతో వివాహం జరిగిందని చెప్పుకొచ్చింది. Also Read: కర్నూలు ప్రజలకు అలర్ట్.. ఆ ఏరియాలకు వాటర్ బంద్! అయితే నెల తరువాత తనను ఆషాఢ మాసం పేరు చెప్పి పుట్టింట్లో వదిలేసి మళ్ళీ అత్తిరాంటికి తీసుకువెళ్లడం లేదని బాధితురాలు దుర్గా భవాని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై స్థానిక పెద్దలను కలిసిన ఫలితం లేకపోవడంతో జంగారెడ్డిగూడెంలో నిరసన దీక్ష చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #నిరసన-దీక్ష మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి