Tax Savings : టాక్స్ సేవ్(Save Tax) చేసుకోవడానికి చాలామంది ఐటీ రిటర్న్స్ సబ్మిట్(Submit IT Returns) చేసేటప్పుడు నకిలీ రెంట్ స్లిప్స్(Duplicate Rent Slips) జత చేయడం తరచుగా కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు అలా చేయడం వల్ల భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీఆర్(ITR) దాఖలు చేసేటప్పుడు నకిలీ ఇంటి అద్దె స్లిప్‌లు వేసిన వారు ఐటీ డిపార్ట్మెంట్ విజిలెన్స్ లో దొరికిపోయారు. ఇలాంటి వారికీ డిపార్ట్మెంట్ నుంచి నేరుగా నోటీసులు అందుతాయి. ఈవిధంగా పట్టుబడితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. భారీ జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు.
ఐటీ డిపార్ట్మెంట్ ఏమంటోంది?
ఐటీఆర్‌ను సబ్మిట్ చేసేటప్పుడు నకిలీ ఇంటి అద్దె స్లిప్(House Rent Slips)ను సమర్పించడం చట్టరీత్యా తప్పని, దీన్ని అరికట్టేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేశామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీఆర్ ఐటీ రిటర్న్స్ లో ఇలా నకిలీ పత్రాలను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఆదాయపు పన్నును నివారించడానికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నకిలీ ఇంటి అద్దె స్లిప్‌లను సబ్మిట్ చేశారు. అందుకే ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు దానిని అరికట్టడానికి సన్నాహాలు చేసింది.
Also Read: గత వారంలో ఆ కంపెనీల వాల్యూ దూసుకుపోయింది! వివరాలివే!!
ఆదాయపు పన్ను శాఖ గత సంవత్సరం నుండి ఇటువంటి కార్యకలాపాలను అరికట్టడం ప్రారంభించింది. దీనివలన మీరు నకిలీ హౌస్ రెంట్ స్లిప్‌ను సమర్పించినట్లయితే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నకిలీ ఇంటి అద్దె స్లిప్పుల(House Rent Slips) కోసం దరఖాస్తు చేసుకున్న వారిని సులభంగా గుర్తించేందుకు ఆదాయపు పన్ను శాఖ ఈసారి కొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయం కూడా తీసుకుంటున్నారు.
డేటా ఇలా చెక్ చేస్తారు..
ఆదాయపు పన్ను శాఖ వివరాల ప్రకారం, ఐటీఆర్ సబ్మిట్ కోసం కొత్త విధానము తెచ్చింది. అలాగే ఫారం 16 లో మార్పులు తీసుకువచ్చింది. కంప్యూటర్ ఆధారిత ప్రక్రియ ద్వారా తప్పు, నకిలీ పత్రాల(House Rent Slips)ను దాఖలు చేసేవారిని సులభంగా గుర్తించే విధంగా ఈ విధానాలు తయారు చేశారు. కంప్యూటర్ వెరిఫికేషన్(Computer Verification) సమయంలో ఎవరైనా వ్యక్తి డేటా సరైనది కాకపోతే, ఆదాయపు పన్ను శాఖ నేరుగా నోటీసు పంపవచ్చు. అంటే నకిలీ అద్దె స్లిప్పులు వేసే వారి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త ఫారం-16 ఎలక్ట్రానిక్ మ్యాచింగ్ ద్వారా ఫారమ్‌లో నమోదు చేసిన డేటాసరైనదో కాదో స్పష్టం చేస్తుందని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అంటే, ఫారమ్‌లో నింపిన డేటాను ఆదాయపు పన్ను శాఖ దాని అన్ని మూలాల ద్వారా ధృవీకరిస్తుంది.