Encounter: గడ్చిరోలి ఎన్‌కౌంటర్ బూటకం... అన్నంలో మత్తు పెట్టారు.. కామ్రేడ్స్ సంచలనం!

దుమ్ముగూడెం ప్రాంతంలో 4 కామ్రేడ్స్‌ను అన్నంలో మత్తు పెట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపిస్తున్నారు. తర్వాత ఎన్‌కౌంటర్‌ అని అని కట్టు కథ అల్లారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నలుగురు ఆదివాసి యువకులను ఎన్‌కౌంటర్‌ పేరుతో హత్య చేశారంటున్నారు.

Encounter: గడ్చిరోలి ఎన్‌కౌంటర్ బూటకం... అన్నంలో మత్తు పెట్టారు.. కామ్రేడ్స్ సంచలనం!
New Update

గడిచిరోలిలో జరిగిన పోలీసుల హత్యలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులే బాధ్యత వహించాలని మావోయిస్టులు డిమాండ్‌ చేస్తున్నారు. దుమ్ముగూడెంలో అరెస్టు చేసి మాయం చేసిన ఛత్తీశ్‌గఢ్‌ ఆదివాసీ యువకులను ఏం చేశారో ప్రభుత్వ జవాబు చెప్పాలంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో చేతులు కలిపి విప్లవ ప్రతిఘాతుక కగార్(అంతిమ దశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయన్నారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.

publive-image

లేఖలో ఏం ఉందంటే?

ప్రజలపై, ప్రజాస్వామిక వాదులపై దాడులు చేయడానికి పూనుకున్నాయి. మావోయిస్టు పార్టీ నిర్మూలనకు నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించాయి. అందులో భాగంగానే మార్చి 19 తేదీన మహారాష్ట్ర, గడిచిరోలి జిల్లా. అహిరి తాలూకాలో కొల్లమర్క అడవి ప్రాంతంలో రేషన్ పల్లి గ్రామం వద్ద ఎన్ కౌంటర్ పేరుతో మా కామ్రేడ్స్ ను కా. మంగు (డివిపిఎం). కా. వర్గేష్(విఎం), కా.రాజు (పిఎం), కా. బుద్రాం (పిఎం)లను హత్య చేశారు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామన్న కాంగ్రేస్ పార్టీ, అధికారాన్ని చేపట్టిన అనంతరం ఇప్పుడు విప్లవకారులను హత్యలు చేస్తుంది. వాస్తవానికి గడిచిరోలిలో జరిగిన ఆ బూటకపు ఎన్ కౌంటర్ ఘటన తెలంగాణ రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వం తెలంగాణ పోలీసు ద్వారా జరిపించింది. తిండి పదార్థాల్లో విషం ఇచ్చి వాళ్ళను స్పృహా కోల్పోయాలా చేశారు. ఆ తరువాత పట్టుకుని తీవ్ర చిత్రహింసలకు గురి చేసి కౄరంగా హత్య చేశారు. ఈ పధకానంతా మంచిర్యాల జిల్లా ఎస్పీ ద్వారా అమలు చేశారు. ఈ ఎన్ కౌంటర్ నెత్తుటి మరకలు తెలంగాణ ప్రభుత్వం చేతులకు అంటకుండా మహారాష్ట్ర పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించినట్లుగా నాటకీయంగా చిత్రీకరించారు. సీ-60 పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు నిర్మూలన కోసం నిర్ణయాత్మక యుద్ధాన్ని మరింత పకడ్భందిగా కొనసాగించడానికి తెలంగాణ, మహారాష్ట్రాల మంచిర్యాల, భూపాలపల్లి, గడిచిరోలి జిల్లాల పోలీసు ఎస్సీలతో సంయుక్త సమావేశం జరిపారు. దీనితో ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడుక్కున్న కాంగ్రేస్ పార్టీదమన నీతి ఏంటో అర్ధమవుతుంది.

అదే విధంగా మార్చి 8వ తేదీన చత్తీష్ గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, ఉపూర్ బ్లాక్, తుమ్మిరెల్లి గ్రామానికి చెందిన మాదేవ్, మాడ్కాల్ అనే ఇద్దరు అమాయక ఆదివాసీ యువకులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి మాయం చేశారు. తమ పిల్లల కోసం 25 రోజులుగా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్ ల చుట్టూతా తిరిగుతున్నారు. కాని వారు ఎక్కడ వున్నరో ఇప్పటికీ చెప్పడం లేదు. మేము అరెస్టు చేయలేదని బుకాయిస్తున్నారు. చత్తీష్ గడ్ నుంచి మిర్చి కోతలకు వెళ్తున్న ఆదివాసీలను మావోయిస్టుల నేపంతో వేధిస్తున్నారు. వారి మాకాంల వద్దకు వెళ్ళి అరెస్టులు చేసి తీసుకెళ్ళి ల్యాకప్ ల్లో తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారు. బాధితుల ద్వారానే పోలీసులు ఎలాంటి చిత్రహింసలకు గురి చేయలేదనే పత్రాలు రాయించుకుని పంపిస్తున్నారు. ఇటీవలే చర్ల పోలీసులు చత్తీష్ గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా నేంద్ర గ్రామస్తులను ఐదుగురిని పట్టుకుని అందులో ముగ్గురి యువకులను చిత్రహింసలకు గురి చేసి పోలీసులు మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదనే పత్రాన్ని రాయించుకుని పంపారు.

దోపిడి పాలకులు ఆదివాసీలకు ఈ నేలపై బ్రతికే అధికారం లేదనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆదివాపీలు ఈ సమాజంలో బ్రతకడమే నేరంగా భావిస్తున్నారు. బడా కార్పోరేట్ల, సామ్రాజ్యవారుల దోపిడి ప్రయోజనాల కోసం వారికి కొమ్ముకాస్తున్న పాలకులు, ఆదివాసీ ప్రాంతాలను.. అడవులను, భూములను అమ్మివేసి క్యాంపులతో నింపుతున్నారు. దీనితో భూములను, నివాసాలను కోల్పోతున్నా ప్రజలు జీవనం. గడువడానికి కూలీకి వెళ్తే అక్కడ కూడా బ్రతకనివడం లేదు. పాలకులు ఆదివాసీలను దేశ పౌరులుగా కూడా గుర్తించడం లేదు. వారికి రాజ్యంగం కల్పించిన చట్టాలు సైతం వర్తించడంలేదు. కనీసం వారిని మనుషులుగా కూడా చూడడం లేదు. వారిని కొట్టిన, చంపిన, అక్రమ కేసులు బనాయించిన అడిగే వారు లేరు. అదివాసీల పేరు చెపుకుని వారి ఓట్లతో అధికారంలో భాగమై మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ, వారికి ఇంతా జరుగుతున్న నోరుమెదపటం లేదు.

గడిచిరోలిలో జరిగిన ఎన్ కౌంటర్ కు, ఆదివాసీ యువకులను మాయం చేసిన ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి, మాయం కాబడిని చత్తీష్ గడ్ రాష్ట్రం యువకుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. వారిని మాయం చేసిన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి..' అని లేఖలో పేర్కొన్నారు

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

#maoist-encounter
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe