Nisha Dahiya: ఒక్కోసారి మనం మోసపోయినట్టు అందరికీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ముఖ్యంగా ఆటాల పోటీల్లో ఎవరైనా మోసంతో గెలిస్తే.. ఆ విషయం అందరికీ తెలిసినా.. నిరూపించే అవకాశం లేక.. అప్పటికే నిర్ణయం జరిగిపోయి ఉండడంతో ఏమీ చేయలేక నిస్సహాయకంగా ఉండిపోతారు. అవతలి వారు చేసిన మోసపూరిత ప్రయత్నంలో ఓటమి పాలైన వారికి కన్నీరు తప్ప మరేమీ మిగలదు. ఇప్పుడు ఇందంతా ఎందుకంటే, పారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం తరఫున మహిళల రెజ్లింగ్ లో పోరాడి ఒదిన నిషా దహియా విషాద ఓటమి గురించి చెప్పడానికే.
Nisha Dahiya: యుద్ధ భూమి అయిన పానిపట్‌లో పుట్టిన నిషా దహియా పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. కానీ ఆమె ఓటమి రెజ్లింగ్ అరేనాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు, ప్రత్యర్థి ఆటగాడు - రెజ్లింగ్ అభిమానిని చప్పట్లు కొట్టేలా చేసింది. 68 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో సోమవారం ప్రిక్వార్టర్ ఫైనల్లో నిషా విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో నిషా 5 నిమిషాల పాటు 8-1తో ఆధిక్యంలో నిలిచింది. అంటే దాదాపుగా విజయానికి కాదు సంచలన విజయానికి అతి దగ్గరలో ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఒక్కసారిగా మోచేతిలో విపరీతమైన నొప్పి వచ్చి నొప్పితో మూలుగుతూ వచ్చింది. దీంతో డాక్టర్లు వచ్చారు. ఆమె ఇక పోరాడటం దాదాపు అసాధ్యం అని చెప్పారు. అయితే, నిషా మాత్రం వెనక్కి తగ్గలేదు. నిలబడింది. పోరాడింది. కానీ, ప్రత్యర్థి ఆమె గాయాన్ని సద్వినియోగం చేసుకుంది. చివరి 12 సెకన్లలో ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌ను 10-8తో గెలుచుకుంది.
Nisha Dahiya: దీంతో నిషా కన్నీళ్ల పర్యంతం అయింది. తృటిలో చేజారిపోయిన ఒలింపిక్ మెడల్ కలను తలుచుకుంటూ కుమిలిపోతూ.. ఎరీనా నుంచి బయటకు వెళ్ళింది. కానీ, ఇక్కడే ఒక కొత్త కథ వెలుగులోకి వచ్చింది. నిషా గాయంతో పోరాడుతుంటే, ఆమె ప్రత్యర్థి ఉత్తర కొరియాకు చెందిన పాక్ సోల్ గమ్ క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసింది. నిషా గాయంపైనే పదే పదే ఎదురుదాడి చేసింది. గాయంపైనే పంచ్ లు విసిరింది. దీంతో నిషా కోలుకోలేకపోయింది. ఒకదశలో 8-1 నుంచి 8-8 కి మ్యాచ్ చేరుకుంది. అంటే అంతగా నిషా ఆమెను నిలువరించింది. సరిగ్గా 12 సెకన్లు మాత్రమే సమయం ఉంది. ఆ సమయంలో నోప్పి ఎక్కువ కావడంతో రిఫరీని అభ్యర్ధించి కొంతసేపు ఆగి నిషా మళ్ళీ పోరాటం ప్రారంభించింది. కానీ, ఆ పన్నెండు సెకన్లలో రెండు సార్లు నిషా గాయం పైనే కొరియన్ దడి చేసి 2 పాయింట్లు సాధించింది. దీంతో నిషా 10-8 తో ఓటమి పాలైంది.
కొరియా ఉద్దేశపూర్వకంగా ఆమె గాయాన్ని పెంచింది..
Nisha Dahiya: మ్యాచ్ ముగిసిన వెంటనే, ఒలింపిక్ వైద్య బృందం నిషాను స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. కోచ్ వీరేంద్ర దహియా మాట్లాడుతూ, 'కొరియా ఉద్దేశపూర్వకంగా నిషాను గాయపరిచింది. కొరియన్ కోచ్ నిషా చేతిపై దాడి చేయమని తన రెజ్లర్‌కు సూచించడం మేము చూశాము. నిషా నుంచి తప్పుడు విధానంలో కొరియన్ పతకాన్ని కొల్లగొట్టింది. నిషా పోటీ ప్రారంభించిన విధానం.. ఆమె స్కోర్ చేసిన విధానం చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఆమె ఓడిపోయే ఛాన్స్ లేదు. కానీ క్రీడాస్ఫూర్తి భిన్నంగా కొరియన్స్ ప్రవర్తించారు అంటూ కోచ్ చెప్పారు.
Also Read : మరో గోల్డ్ కు జావెలిన్ గురిపెట్టబోతున్న నీరజ్.. మ్యాచ్ ఎప్పుడంటే..