ప్చ్.. రెయిన్‌ ఎఫెక్ట్..బీజేపీ మహాధర్నా వాయిదా...!!

ఇవాళ(జులై 25) ఇందిరాపార్క్, ధర్నా చౌక్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చిన బీజేపీకి వరణుడు బ్రేకులు వేశాడు. తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధర్నాను వాయిదా వేస్తున్నట్లు టీబీజేపీ ప్రకటించింది.

ప్చ్.. రెయిన్‌ ఎఫెక్ట్..బీజేపీ మహాధర్నా వాయిదా...!!
New Update

publive-image

మిషన్ తెలంగాణ.. బీజేపీ తెలంగాణలో జోరు పెంచింది. మొన్నటి వరకు నేతల మధ్య సమన్వయలోపం..పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. ఆ తర్వాత పరిణామాలతో మళ్లీ గాఢీలోకి వచ్చే ప్రయత్నాలు షురూ చేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాలు..తెలంగాణ బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏదైనా మార్పు చేయకపోతే...అధికారంలోకి రాలేమోనన్న ఆందోళన హైకమాండ్ లో కనిపించింది. దీంతో బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించారు. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణలో బీజేపీ నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో కిషన్ రెడ్డికి..అగ్నిపరీక్ష లాంటిదే. అయినా సరే..పోరాడాలి. పోరాడితే కదా ఫలితం అనేది వచ్చేది. దీంతో హీట్ ను పెంచారు. వరుస ఆందోళనలు ధర్నాలతో తెలంగాణలో బీజేపీ ఫీవర్ వచ్చేలా చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఈనేపథ్యంలో నేడు ఇందిరాపార్క్, ధర్నా చౌక్ దగ్గర మహాధర్నాకు పిలుపునిచ్చింది బీజేపీ. అయితే తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధర్నాను వాయిదా వేస్తున్నట్లు టీబీజేపీ ప్రకటించింది. వచ్చే 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్ధేశ్యంతోనే ఈ మహాధర్నాను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ తెలిపింది. ఈ మహాధర్నాను నిర్వహించడం కోసం నిర్ణయించాల్సిన తేదీని అతి త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ ధర్నాలతో పార్టీ మైలేజీని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిరసనలు నిత్యం ప్రజల్లోకి వెళ్తాయి. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ధర్నాలు ఉపయోగపడతాయి. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీలో కొంత చురుకుదనం కనిపించినట్లే అనిపిస్తోంది. అటు కాంగ్రెస్‌ కూడా దూకుడుగా ఉండడంతో నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్నోళ్లంతా...ఇప్పుడు త్రిముఖ పోరు తప్పదు అంటున్నారు. మరి కిషన్‌రెడ్డి ప్లాన్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందన్నది చూడాల్సి ఉంది...

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe