AP: డయేరియా కలకలం.. ఒకరు మృతి.. 50 మంది అస్వస్థత.!

కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలో గ్రామస్తులు డయేరియా భారిన పడుతున్నారు. త్రాగు నీరు కలుషితం కావడంతో సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా మార్గం మధ్యలో నాగమణి అనే మహిళ మృతి చెందింది.

New Update
AP: డయేరియా కలకలం.. ఒకరు మృతి.. 50 మంది అస్వస్థత.!

Diarrhea in Kadapa:  కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారు. రెండు రోజులుగా ప్రజలు డయేరియా భారిన పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరుతున్నారు. నాగమణి అనే మహిళ చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

Also Read: కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!

గ్రామ సచివాలయంలో వైద్యులు పలువురికి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పర్యటిస్తున్న అధికారుల బృందం.. వాటర్ ట్యాంక్ లో నీటిని టెస్టింగ్ కి పంపించారు. DM &ho నరసింహ నాయక్ మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని.. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వైద్యం చేయించుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా ఉండకుండా, సచివాలయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు