Kadapa: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి బలైయ్యాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాదకరమైన ఘటన కడప జిల్లా బెల్లం మండిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు విద్యార్థులు ఒకే సైకిల్ పై ఎంతో సంతోషంగా వెళ్తున్నారు.
Also Read: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం!
అయితే, బెల్లం మండిలో విద్యుత్ తీగలు తెగిపోయి కిందకి వేలాడుతుండగా అటు వైపు వెళ్తున్న ఆ విద్యార్థులకు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఆ ఇద్దరు కుప్పకూలిపోయారు. సైకిల్ సైతం కరెంట్ షాక్ తగిలి కాలిపోయింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు విద్యార్థులను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థి తన్విరుల్లా మృతి చెందాడు. మరొక విద్యార్థి తీవ్ర గాయాలో చికిత్స పొందుతున్నాడు.
Also Read: హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. డైరీలో ఏముంది ?
ఘటనపై బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యుత్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తెగిన విద్యుత్ తీగలను చూసుకుని సరి చేసి ఉంటే.. ఈ రోజు తమ కొడుకు మృతి చెందేవాడు కాదని మండిపడుతున్నారు.