Shreyas Talpade: 'పుష్ప' లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..!

నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయస్ తాల్పాడే కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నెట్టింట్లో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. శ్రేయస్ హిందీలో విడుదలైన 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ కు వాయిస్ ఓవర్ చెప్పారు.

New Update
Shreyas Talpade: 'పుష్ప' లో అల్లు అర్జున్ కు డబ్బింగ్ చెప్పిన నటుడికి హార్ట్ ఎటాక్..!

Shreyas Talpade: అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa) సినిమా బన్నీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్నీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూర్ యాసలో మాట్లాడుతూ అందరినీ బాగా ఆకట్టుకున్నారు. ఇక హిందీలో విడుదలైన పుష్ప చిత్రంలో బన్నీకి డబ్బింగ్ చెప్పారు శ్రేయాస్ తల్పాడే. శ్రేయాస్ వాయిస్ ఓవర్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. హిందీలో పుష్ప 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు శ్రేయాస్.

Also Read: Rana Daggubati : ‘రాక్షస రాజా’.. భల్లాల దేవ బర్త్ డే స్పెషల్

ఇక తాజాగా శ్రేయస్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నటుడు, డబ్బింగ్ ఆరిస్ట్ శ్రేయస్ కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శ్రేయస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.శ్రేయస్ హిందీ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తారు. హిందీ చిత్రం 'ఓం శాంతి ఓం' లో షారుఖాన్ స్నేహితుడిగా పప్పు మాస్టర్ పాత్ర బాగా గుర్తింపు పొందింది. హిందీలో గోల్ మాల్, వెల్ కమ్ టూ సజ్జన్ పూర్ చిత్రాల్లో నటించారు. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శ్రేయస్ నిర్మాతగా కూడా పని చేశారు.

publive-image

Also Read: Y.S Sharmila Son Marriage : ‘అందులో నిజం లేదు..’ క్లారిటీ ఇచ్చిన చట్నీస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు