13 సొరచేపల్లో కొకైన్ ఆనవాళ్లు కనుగొన్న శాస్త్రవేత్తలు!

బ్రెజిల్ లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ సొరచేపల పై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొరచేపలు కొకైన్ సేవిస్తున్నట్టు వారు పరిశోధనలో కనుగొన్నారు. అక్రమ కొకైన్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్ధాలు సముద్రంలో కలసి వాటి ప్రభావం జీవులపై పడుతున్నాయని పేర్కొన్నారు.

13 సొరచేపల్లో కొకైన్ ఆనవాళ్లు కనుగొన్న శాస్త్రవేత్తలు!
New Update

డ్రగ్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా పెద్ద తలనొప్పిగా మారింది. మాదకద్రవ్యాల వినియోగం అమ్మకం శిక్షార్హమైన నేరాలు అయినప్పటికీ, చాలా దేశాలు వాటిని ఖచ్చితంగా అమలు చేయలేకపోతున్నాయి. అందువల్ల ప్రపంచంలోని వివిధ దేశాలలో డ్రగ్స్ సరఫరా యథేచ్చగా జరుగుతుంది.

ఈ సందర్భంలో, బ్రెజిల్ తీరంలో సొరచేపలు కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్రెజిల్ లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధలో డ్రగ్స్ వల్ల సముద్రపు జలాలు కలుషితమైతే సొర చేపలపై ఎటువంటి  ప్రభావం చూపిస్తాయనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. దీని కోసం 13 షార్క్ చేపలపై పరిశోధన జరిపారు. వాటి కండరాలు, లివర్ పై ల్విక్విడ్ క్రోమోటోగ్రఫీ అనే పరీక్షను శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 13 చేపల్లోనూ కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు వారు గుర్తించారు.

ఇది సొరచేపల శరీరంపై మాత్రమే కాకుండా ఇతర సముద్ర జీవులపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందని వారు తెలిపారు. ఒకవైపు అక్రమ కొకైన్ ఫ్యాక్టరీల నుంచి దొంగిలించిన వస్తువులు సముద్రంలో కలిసిపోతున్న వ్యర్థాల వల్ల కొకైన్‌లు తిన్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

#drunk-sharks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe