ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ కలకలం..!! ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. నో ఫ్లెయింగ్ జోన్ లో డ్రోన్స్ ఎగురుతున్నట్లు కనిపించడంతో ఎన్సీపీ భద్రతా సిబ్బంది అలర్టయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ఢిల్లీపోలీసులకు ప్రధాని మోడీ భద్రతా సిబ్బంది సమాచారాన్ని అందించారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. By Bhoomi 03 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ తిరుగుతుందన్న వార్త కలకలం సృష్టించింది. ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు సమాచారం అందిన వెంటనే ఎస్పీజీ ...ఘటనపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రధాని భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ప్రధాని నివాసం పైన నో ఫ్లయింగ్ జోన్‌లో డ్రోన్ ఎగురుతున్నట్లు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ డ్రోన్ కోసం ఢిల్లీ పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి డ్రోన్ ఆచూకీ లభ్యం కాలేదు. ప్రధాని నివాసం రెడ్ నో ఫ్లై జోన్ లేదా నో డ్రోన్ జోన్ పరిధిలో ఉంటుంది. ఈ జోన్ లో డ్రోన్లపై పూర్తిస్థాయి నిషేధం ఉంటుంది. అయినా కూడా డ్రోన్ కనిపించడంతో ఎస్పీజీ సిబ్బంది పోలీసులు సమాచారం అందించడం కలకలం రేపుతోంది. అయితే ప్రధానమంత్రి ఇంట్లో రాడార్ ఉందని..అది 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైనా ఎగురుతున్నట్లు కనిపిస్తే, రాడార్ దానిని గురించి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఢిల్లీలో రేస్ కోర్స్ రోడో ప్రధాని నివాసం ఐదు భవనాల సముదాయంతో ఉంది. 9,7,5,3,1 నెంబర్లతో ఈ భవనాలు ఉన్నాయి. ప్రధాని కార్యాలయం మొత్తం కూడా భద్రతా వలయంలోనే ఉంటుంది. సామాన్య ప్రజలే కాదు మీడియా కూడా అక్కడ పర్మిషన్ ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే జర్నలిస్టులను కాన్ఫరెన్స్ రూమ్స్ వరకు అనుమతిస్తుంటారు. అయితే అక్కడ ఫొటోలు తీయడం కూడా నిషేధం. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి