Water after food: నీరు చాలా ప్రయోజనకరమైనది, ముఖ్యమైనది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం అనేక వ్యాధులకు దూరంగా ఉంటుంది. వ్యాధులను దూరంగా ఉంచడానికి, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడానికి.. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. అయితే ఎంత నీరు ఎప్పుడు తాగాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఆహారంతో పాటు నీళ్లు తాగే వారి ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు, ఎలా నీరు త్రాగాలి అనేది కూడా చాలా ముఖ్యం. ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తిన్న కొంత సమయం తర్వాత నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం ఏంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కలిగే నష్టాలు:
- తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగదు, అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం తీసుకున్న కొంత సమయం తర్వాత మాత్రమే నీరు త్రాగాలి.
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుంది:
- ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిన్న వెంటనే నీళ్లు తాగితే.. ఆహారం జీర్ణమయ్యే సహజ సమయాన్ని మార్చేస్తుంది. దీనివల్ల అవసరమైన దానికంటే ఎక్కువ తరచుగా ఆకలిగా అనిపించి అతిగా తింటారు. దీని కారణంగా బరువు పెరిగి ఊబకాయం కావచ్చు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య కూడా రావచ్చు. కడుపు తిమ్మిరి, నొప్పితోపాటు రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేసే ఇన్సులిన్ స్పైక్ ప్రమాదం కూడా ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పొరపాటున కూడా అలాంటి తప్పులు చేయకూడదు.
- తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత, అరగంట ముందు, తర్వాత నీరు త్రాగవచ్చని నిపుణులు అంటున్నారు . ఆహారం తిన్న తర్వాత, నీరు త్రాగడానికి ముందు 10 నిమిషాల నడక మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. శరీరం అనేక సమస్యల నుంచి రక్షించబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ’పప్పీ యోగా’ ట్రెండ్.. దీని గురించి అసలు మేటర్ ఇదే!