Summer Soda: ఎండాకాలం సోడా ఎక్కువ తాగితే మగవారికి ఆ సమస్యలు తప్పవా? చాలా మంది కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. వేసవిలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. సోడా, కలర్ సోడా వంటివి ప్రత్యేకంగా తీసుకుంటారు. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. By Vijaya Nimma 12 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Summer Soda: వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్‌తో బాధపడుతుంటారు. దీని వల్ల గొంతు ఎండిపోవడం, ఆయాసం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో కొన్ని శీతల పానీయాలు తాగాలనిపిస్తుంది. అందులో సోడా ఒకటి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది సోడా వైపు మొగ్గు చూపుతుంటారు. సోడా అనేక రకాల్లో లభిస్తుంది. అయితే సోదా వినియోగం కొన్ని ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. సోడా తాగడం వల్ల కలిగే అనేక దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సోడాలోని చక్కెర దంతక్షయాన్ని కలిగిస్తుంది. దంతాలు రంగు మారడం, సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు ఉంటాయి. సోడాల్లో కేలరీలు చాలా ఎక్కువ. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. డైట్ సోడాలో ఉండే కృత్రిమ స్వీటెనర్లు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. సోడా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోడా తాగడం వల్ల రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. సోడా తాగితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. సోడాలోని ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. సోడా తాగడం గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం, ప్రీఎక్లంప్సియా ప్రమాదాన్ని పెంచుతుంది. పురుషులలో సంతానోత్పత్తి తగ్గుతుంది. పురుషులలో స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. అంతేకాకుండా సంతానోత్పత్తిని బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోడాలోని కెఫిన్, చక్కెర వ్యసనానికి గురిచేస్తాయి. రోజూ సోడా తాగాలనిపిస్తుంటుంది. సోడా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో సోడాకు బదులు హెల్తీ డ్రింక్స్ తాగాలని, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, పండ్ల రసాలు, మజ్జిగ, గ్రీన్ టీ తాగడం ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈ-వేస్ట్ పర్యావరణంతో పాటు ఆరోగ్యానికీ హానికరమా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #summer-soda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి