Health Care : ఉదయాన్నే టీ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా ఎప్పుడూ తాగకండి. ఆరోగ్యంపై చెడు ప్రభావంచూపుతుంది. గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

New Update
Health Care : ఉదయాన్నే టీ తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Danger With Tea : మనలో చాలా మందికి ఉదయం పరగడుపున టీ(Tea) తాగే అలవాటు ఉంటుంది. ఉదయం వేడి వేడిగా పొగలు కక్కే టీ తాగనిది ఉండలేరు. అయితే చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందంటున్నారు. గుండెల్లో మంట, ఎసిడిటి వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉదయాన్నే టీ తాగేటప్పుడు మీరు చేసే కొన్ని తప్పులు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అవేంటో చూద్దాం.

పొద్దున లేచిన వెంటనే పళ్లు తోమకుండా..నోట్లోనీళ్లు పోసుకోకుండా చాయ్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. కొంతమంది బెడ్ టీ తాగుతుంటారు. ఇది తాగడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయాన్నే టీ తాగేటప్పుడు మీరు చేసే ఈ తప్పులు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నిచూపుతాయి.

నీళ్లు తాగకూడదు:
చాయ్ తాగిన తర్వాత చల్లని పదార్థాలు లేదా నీళ్లు తాగకూడదు. పొరపాటున వీటిని తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ప్లాస్టిక్ కప్పుతో చాయ్:
మీరు ఎప్పుడూ ప్లాస్టిక్ కప్పులో చాయ్ తాగకూడదు. ఇలా తాగడం వల్ల శరీరంలో అనేక రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది.

ఆహారం:
మీరు ఏదైనా ఆహారం లేదా పానీయంతో చాయ్ తాగకూడదు. టీ తాగే ముందు లేదా టీ తాగిన తర్వాత ఏదైనా తినే అలవాటు ఉంటే..దానిని స్కిప్ చేయండి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది.

టీతోపాటు నిమ్మకాయ:
టీలో నిమ్మరసం కలుపుకుని తాగకూడదు. దీని కారంగా మీరు ఎసిడిటీ, డయేరియా సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇలా చేయడం మానుకోండి. అలాగే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు కూడా రావు.

ఇది కూడా చదవండి:  గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా నెయ్యి కలుపుకుని పరగడుపున తాగుతే..ఈ 4 వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు