Pineapple Tips: పైనాపిల్ ఫ్రూట్స్ తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జూస్‌లతోపాటు అప్పుడప్పుడూ జీర్ణక్రియకు తోడ్పడే పైనాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, విటమిన్లు సి, బి1, బి6, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గింస్తుంది. పైనాపిల్ తింటే అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు. పైనాపిల్స్ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అధికంగా కలిగి ఉంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆనారోగ్య సమస్యల ప్రమాదం ఉంది. పైనాపిల్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ బ్రోమెలైన్ ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ తాగితే చర్మాన్ని మృదువుగా, శరీరం కొల్లాజెన్‌ని సింథసైజ్ చేస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేయటంలో బెస్ట్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ బీటా కెరోటిన్, విటమిన్ ఎ అద్భుతమైన మూలం. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మానికి, గాయం నయం చేస్తుంది. అంతేకాదు అకాల చర్మ వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తాయి. 100 గ్రాముల పైనాపిల్‌లో 50 కేలరీలు, 2.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే ఆకలిని అరికట్టవచ్చు. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీవక్రియను పెంచుతుంది. బ్రోమెలైన్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీనివల్ల తిన్న ఆహారాల నుంచి శరీరానికి న్యూట్రీషన్స్‌ను సులభంగా చేరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ చిట్కా ఫాలో అయితే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత పారిపోతుంది!