Fennel Seed Water: సోంపు నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు!

సోంపు గింజలు జీర్ణక్రియ, కడుపు సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. సోంపును రాత్రంతా నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మచ్చలు, మొటిమలు, గ్యాస్, ఎసిడిటీ, ముఖంపై ముడతలు, దంతాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Fennel Seed Water: సోంపు నీళ్లు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు!

Fennel Seed Water: భారతీయులు ఆహారాన్ని ఇష్టపడతారు. భోజనం తర్వాత రిఫ్రెష్‌మెంట్ కోసం సోంపుగింజలను తింటారు. సోంపు గింజలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. ఈ సోంపు తిసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు.  అందువల్ల ఖాళీ కడుపుతో సోంపు నీళ్లు తాగాలని సలహా ఇస్తారు. ఇది చాలా తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా దూరం చేస్తుంది. సోంపు నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చాలామందికి తెలియదు. అయితే ఈ చిన్న విత్తనాలు తాజాదనానికి మాత్రమే కాకుండా వంట, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. సోంపుగింజల నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సోంపు నీటి వల్ల కలిగే ప్రయోజనాలు: 

  • సోంపులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ నీరు తాగితే మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంటుంది.
  • సోంపులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ నీటిని రోజూ తాగడం వల్ల కంటి సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వటంతోపాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది.
  • సోంపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని మౌత్‌ఫ్రెషర్‌గా ఉపయోగిస్తారు. ఇది దంతాలు, చిగుళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది.
  • సోంపు వాటర్ చర్మానికి జుట్టుకు చాలా మంచిది. ఇది మచ్చలు, మొటిమలను నయం చేసి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
  • సోంపు రసం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది, సోపు నీళ్లు తాగడం వల్ల ముఖంపై ముడతలు, ఎరుపుదనం తొలగిపోతాయి.
  • సోంపు నీరు చర్మానికి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఈ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • సోంపు రసం చేయడానికి సోంపును 10 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. తరువాత నానబెట్టిన సోంపును మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత గ్లాస్లో ఫిల్టర్ చేయాలి. దానిలో రుచికి అనుగుణంగా తేనె వేసి కలపాలి. ఈ సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతోతాగాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఎర్రటి దద్దుర్లతో పాటు దురద.. మరణానికి దారి తీసే ఈ వ్యాధి గురించి తెలుసా!