బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతుంటే ఆ మజానే వేరుంటుంది కదా. బుక్క బుక్కకు సిప్ చేస్తూ లాగిస్తూ వావ్ అంటుంటారు. ఇలా తాగితే కాస్త రిలాక్స్ గా ఉన్నట్లు త్రేన్పులు వస్తుంటాయి. అప్పటికప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు. కానీ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
సోడా తాగుతే:
భోజనం ఏదైనా సరే కంప్లీట్ అయ్యాక కాస్త సోడా తాగేతే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తిన్న తర్వాత సోడా తాగుతే గ్యాస్ పెరుగుతుంది. దీంతో చాలా సమస్యలు వస్తాయి.
కడుపులోగ్యాస్:
తిన్నతర్వాత కడుపులో గ్యాస్ పెరుగుతే పొట్ట నొప్పి వస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. దీంతో కూర్చోలేరు..నిల్చోలేక ఇబ్బందులు పడుతుంటారు. కానీ కొంతమందికి గుండెల్లో మంట,మలబద్ధకం, త్రేన్పులు, వెన్నులో నొప్పి తోపాటు ఛాతీనొప్పి కూడా వస్తుంది.
అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే డ్రింక్స్ ఇవే:
జ్యూసులు:
కొంతమంది తిన్నతర్వాత జ్యూస్ లు తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో బరువు కూడా పెరుగుతారు. అందుకే భోజనం చేసిన తర్వాత వీటిని తాగకపోవడమే మంచిది.
మరేం తాగాలి:
తిన్న తర్వాత వేడినీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజనం మధ్యలో నీళ్లు అస్సలు తాగొద్దు. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు లేదా జీలకర్ర నీరు తాగడం మంచిది. మీరు ఏం తాగడం ఇష్టం లేనట్లయితే కాసేపటి తర్వాత గోరువెచ్చని నీరు తాగండి. దీంతో తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తాగవచ్చు.
ఇది కూడా చదవండి: హమ్మయ్య బంగారం కాస్త తగ్గింది.. ఇది గుడ్ న్యూసే కదా.. ఇప్పుడెంతంటే..