Basil Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే 7 అద్భుతమైన ప్రయోజనాలు!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల స్కీమియా, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనె, అల్లం కలిపి తాగితే ఆస్తమా, ఇన్‌ఫ్లుఎంజా, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Basil Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే 7 అద్భుతమైన ప్రయోజనాలు!

Basil Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే 7 అద్భుతమైన ప్రయోజనాలు!హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తులసి ఆకులు తినాలని చెబుతూ ఉంటారు. తులసి ఆకులలో డైటరీ ఫైబర్, ప్రోటీన్, సోడియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ డి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులను నయం చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. తులసి ఆకులతో పాటు తులసి నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉదయం పరిగడుపున తీసుకుంటే అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పరిగడుపున తులసి నీళ్లు తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే కలిగే ప్రయోజనాలు:

  • తులసిలో విటమిన్ సి, జింక్ పుష్కలం. ఇది సహజ రోగనిరోధకశక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున తులసి నీటిని తాగితే నేచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివిటీ పెరిగి రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
  • తులసిలో కాంఫేన్, సినియోల్, యూజినాల్ ఛాతీలో జలుబుని తగ్గిస్తుంది. తులసి ఆకుల రసాన్ని తేనె, అల్లం కలిపి తాగితే ఆస్తమా, బ్రోన్కైటిస్, ఇన్‌ఫ్లుఎంజా, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • తులసి నీరు తాగడం వల్ల రక్తంలోని లిపిడ్ కంటెంట్ తగ్గుతుంది. ఇస్కీమియా, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల గుండె జబ్బులను తగ్గిస్తుంది.
  • ఒసిముమోసైడ్స్ A , B సమ్మేళనాలు తులసిలో ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. తులసి నీరు మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లు సెరోటోనిన్, డోపమైన్లను సమతుల్యం చేస్తుంది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, రక్తపోటును సాధారణంగా ఉంచుతుంది.
  • ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల దంతాలు, చిగుళ్లు బలపడతాయి. అంతేకాకుండా నోటి అల్సర్లను నయం చేసి నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే నరదృష్టి దెబ్బకి పోతుంది.. ఇంటి ముందు ఇలా చేయండి

Advertisment
Advertisment
తాజా కథనాలు