Explainer: రాజకీయాల బురదలో డ్రైడ్ ఈస్ట్.. దీనికీ డ్రగ్స్ కి ఏమిటి సంబంధం?

విశాఖలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఇప్పుడు రాజకీయంగా గందరగోళం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు డ్రైడ్ ఈస్ట్ అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఉపయోగిస్తారు? డ్రగ్స్ కీ దీనికి సంబంధం ఏమిటి? ఇలాంటి సందేహాలు సహజం. ఈ సందేహాలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Explainer: రాజకీయాల బురదలో డ్రైడ్ ఈస్ట్.. దీనికీ డ్రగ్స్ కి ఏమిటి సంబంధం?

Explainer: డ్రైడ్ ఈస్ట్.. ఇప్పుడు వార్తల్లో ఏక్కువగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా ఏపీలో ఈ డ్రైడ్ ఈస్ట్ చుట్టూ రాజకీయాలు గిర్రున తిరుగుతున్నాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఏపీలో విశాఖపట్నం పోర్టులో 25 వేల టన్నుల డ్రగ్స్ కంటైనర్ సీబీఐ ప్రకటించింది. ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చిందనీ, దీనిని సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకుందని సీబీఐ చెబుతోంది. అయితే, సంధ్య ఆక్వా ప్రతినిధులు మాత్రం.. కంటైనర్‌లో ఉన్నది రొయ్యల మేతలో కలిపే ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టేనని చెబుతోంది. అయితే, అనుమానాస్పద డ్రగ్ సబ్‌స్టెన్స్ ఇందులో దొరికిందంటూ సీబీఐ ఆ కంటైనర్లను సీజ్ చేసింది. ఇప్పుడు అందరిలోనూ ఎన్నో సందేహాలు. డ్రైడ్ ఈస్ట్ అని కంపెనీ చెబుతుంటే, అందులో  డ్రగ్ సబ్‌స్టెన్స్ ఉన్నాయని సీబీఐ చెబుతోంది అంటే ఈస్ట్ నుంచి డ్రగ్స్ చేయవచ్చా? అసలు ఈ డ్రైడ్ ఈస్ట్ అంటే ఏమిటి?(Explainer) మనం వంటల్లో వాడే డ్రైడ్ ఈస్ట్.. ఇదీ ఒకటేనా? లేక వేరు వేరయా.. ఇలా ఎన్నో సందేహాలు అందరికీ కలుగుతున్నాయి. ఆ సందేహాలకు సమాధానం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిద్దాం. 

Explainer: అసలు డ్రైడ్ ఈస్ట్ అంటే ఏమిటి?

dried yeastఈస్ట్ అంటే ఒక బాక్టీరియా. ఇంకా చెప్పాలంటే సూక్ష్మ క్రిమి. మనం స్కూల్ లో చదువుకునే టప్పుడు శిలీంధ్రాలు అనే మాట వినే ఉంటాం. ఈస్ట్ అనేది కూడా ఆ రకానికి చెందిన సూక్ష్మజీవే. ఈ బాక్టీరియా నుంచి పరమాణువులు వేరు చేసి డ్రైడ్ ఈస్ట్ తయారు చేస్తారు. ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది. యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్.. ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్. యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మన గసగసాలను పోలిన గింజల్లా ఉంటుంది. అదే ఇనాక్టివ్  తెల్లని పొడిలా ఉంటుంది. 

Explainer: డ్రైడ్ ఈస్ట్ ఎక్కడ ఉపయోగిస్తారు?
నిజానికి ఈస్ట్ ఉపయోగాలు చాలా ఎక్కువ. ఫుడ్ ఇండస్ట్రీలో ఈస్ట్ విరివిగా వాడడం జరుగుతుంటుంది. కేకులు, బ్రేడ్స్, పెరుగు, దోశెల పిండి వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రెండు రకాల డ్రైడ్ ఈస్ట్ ను ఇక్కడ ఉపయోగిస్తారు. ఇక రొయ్యలు వేగంగా పెరగడానికి వాటి మేతలో కూడా ఈస్ట్ ఉపయోగిస్తారు. అలాగే పశువుల మేతలోనూ దీనిని వాడతారు. ఈ అన్ని చోట్లా యాక్టివ్, ఇనాక్టివ్ రెండిటినీ వాడుతుంటారు. నిజానికి ఈ రెండిటినీ చూడటానికి తేడాగా ఉంటాయి కానీ, ఒకేవిధంగా పనిచేస్తాయి. 

Explainer: డ్రైడ్ ఈస్ట్ నుంచి డ్రగ్స్ తయారు చేయవచ్చా?
ఈస్ట్ నుంచి డ్రగ్స్ తయారు చేయడం అనేది కష్టం అనే నిపుణులు చెబుతున్నారు. కానీ, రొయ్యల మేతలో వాడే డ్రైడ్ ఈస్ట్ పౌడర్ లో డ్రగ్స్ కలిపి సరఫరా చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఒకవేళ డ్రగ్స్ కలిపినట్టయితే సులభంగా గుర్తించే వీలుంటుందని చెప్పారు. కేజీ డ్రై ఈస్ట్ లో 50 నుంచి 100 గ్రాముల డ్రగ్స్ కలిపి ఉంటే.. దానిని భౌతికంగా గుర్తించవచ్చు. అంటే చూసిన వెంటనే గుర్తుపట్టవచ్చు. అంతకంటే తక్కువ కలిపితే.. వాటిని మైక్రోస్కోపిక్ టెస్ట్ ద్వారా గుర్తించే వీలుంటుంది. ప్రాథమికంగా ఇలా డ్రగ్స్ కలిపినట్టు గుర్తించిన తరువాత ఆ సాంపిల్స్ ను గ్యాస్ కోమెటోగ్రఫీ పరికరాలను ఉపయోగించి పరిశీలించడం ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. 

Also Read: ఎన్నికల వేళ ఉల్లి పై కేంద్రం కీలక నిర్ణయం.. 

CBI Dried yeast

ఇటీవల కాలంలో డ్రగ్స్ ను వేరే పదార్ధాలతో కలిపి రవాణా చేస్తున్న కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ భారీ కంటైనర్ లో డ్రగ్స్ కలిపి ఉండవచ్చనే అనుమానాలతో.. సీబీఐ వీటిని సీజ్ చేసింది. ఇప్పుడు ఇందులోని పదార్ధాన్ని టెస్టుల కోసం పంపించారు. ఆ టెస్టుల ఆధారంగా డ్రైడ్ ఈస్ట్ లో ఏదైనా కలిపారా లేదా అనేది తెలుస్తారు. 

Explainer: డ్రైడ్ ఈస్ట్ లో కలపడం వలన ప్రయోజనం ఏమిటి?
డ్రైడ్ ఈస్ట్ లో డ్రగ్స్ కలిపి సరఫరా చేయడం తేలిక. అనుమానం వచ్చి పట్టుకుంటే తప్ప.. దానిని పరీక్షగా చూస్తే తప్ప అందులో డ్రగ్స్ ఉన్న విషయం తెలీదు. అంతేకాకుండా, ఈ మిశ్రమాన్ని విడదీయడం కూడా చాలా తేలిక. సాధారణంగా ఈస్ట్ ను ఉపయోగించేటప్పుడు ఇతర పోషకాలతో కలిపి ఉపయోగిస్తారు. 

అంతరిక్షంలోకి ఈస్ట్.. 
ఈస్ట్ మానవులకు సమానమైన జన్యుపరమైన ఆకృతిని కలిగి ఉందని తేలింది.  కాస్మిక్ రేడియేషన్ ద్వారా ఇది ఎలా ప్రభావితమవుతుందో చూడాలని శాస్త్రవేత్తలు భావించారు.  అంతరిక్షంలో ఈస్ట్‌ను అధ్యయనం చేయడం ద్వారా వ్యోమగాములు - సంభావ్య అంతరిక్ష కాలనీలలోని ఇతర భవిష్యత్తు సభ్యులను హానికరమైన రేడియేషన్ నుండి రక్షించడంలో ఈస్ట్ సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే NASA ఆర్టెమిస్ 1 లూనార్ మిషన్ ఈస్ట్ నమూనాలతో నిండిన షూ బాక్స్-సైజ్ పాడ్‌ను అంతరిక్షంలోకి పంపించింది. 

ఈస్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. 

  • 1680లో అంటోన్ వాన్ లీవెన్‌హోక్‌కి ఈస్ట్ సూక్ష్మ రూపాన్ని గురించిన మొదటి వర్ణన చేశాడు
  • 1857లో లూయిస్ పాశ్చర్ ణ్వ ప్రక్రియకు కారణమయ్యే ఏజెంట్లు ఈస్ట్‌లు అని నమ్మాడు.  కిణ్వ ప్రక్రియ ప్రక్రియను కనుగొన్నప్పుడు ఈస్ట్ చరిత్ర నిర్ణయాత్మక మలుపు తిరిగింది. అతను ఆల్కహాలిక్ కిణ్వ ప్రక్రియకు బాధ్యత వహించే సూక్ష్మజీవిగా ఈస్ట్ కీలక పాత్రను నిర్ధారించాడు. బ్రెడ్ సువాసనలు, రుచులను రూపొందించడానికి ఈస్ట్ అనివార్యమని పాశ్చర్ చాలా ముందుగానే అర్థం చేసుకున్నాడు. 
  • ఈస్ట్ మొదటిసారిగా 1822లో వియన్నాలో వాణిజ్యపరంగా అమ్మడం మొదలు పెట్టారు 
  • 1920ల నాటికి ఈనాడు మనకు తెలిసిన వాణిజ్య ఈస్ట్ పుట్టింది
  • కిణ్వ ప్రక్రియ ద్వారా మద్యాన్ని తయారు చేయడానికి ఈస్ట్ ఉపయోగిస్తారు. 
Advertisment
Advertisment
తాజా కథనాలు