Dream Interpretation: మీకు ఈ కలలు వస్తే పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి.. ఎందుకంటే..

చాలా మంది తమకు వచ్చిన కలలను ఉత్సుకతతో ఇతరులకు వెంటనే చెప్పేస్తుంటారు. అయితే, స్వప్న శాస్త్రంలో ఇది సరైంది కాదని చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదు. ఇతి వారికి హానీ కలిగిస్తుందట.

New Update
Dream Interpretation: మీకు ఈ కలలు వస్తే పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి.. ఎందుకంటే..

Dream Interpretation: స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. స్వప్న శాస్త్రం(Dream Interpretation) ప్రకారం.. ఈ కలలు మనకు భవిష్యత్ సంఘటనల గురించి వివరిస్తాయి. రాత్రి పడుకున్న తరువాత కలలు(Dreams) వస్తుంటాయి. అందులో రకరకాల కలలు ఉంటాయి. కొందరికి దేవుళ్లకు సంబంధించిన కల వస్తే.. మరికొందరికి దెయ్యాలకు సంబంధించిన కలల వస్తున్నాయి. మరికొన్ని సంఘటనలు, పరిస్థితులకు సంబంధించిన కలలు వస్తాయి. అయితే, చాలా మంది తమకు వచ్చిన కలలను ఉత్సుకతతో ఇతరులకు వెంటనే చెప్పేస్తుంటారు. అయితే, స్వప్న శాస్త్రంలో ఇది సరైంది కాదని చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదు. ఇతి వారికి హానీ కలిగిస్తుందట. మరి ఏ కలలను ఇతరులకు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

కలలో వెండి కలశం కనిపించడం.

మీరు కలలో వెండి కలశం చూసినట్లయితే, అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కలలో వెండి కలశం కనిపిస్తే సంతోషించాల్సిందే. ఈ కల జీవితంలో మంచి రోజులు రావడాన్ని సూచిస్తుంది. ఈ కల ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది. ఈ కల మీరు త్వరలో అన్ని కష్టాల నుండి బయటపడబోతున్నారని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం, ఈ కల ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే ఇది కల నెరవేరదు.

మరణానికి సంబంధించిన కల..

చాలా మంది వ్యక్తులు తమ సొంత మరణాన్ని లేదా వారికి దగ్గరగా ఉన్న వారి మరణాన్ని వారి కలలో చూస్తారు. అలాంటి కల చూసి భయపడి ఇతరులకు చెబుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం, మీకు అలాంటి కల కనిపిస్తే మీరు భయపడాల్సిన పనిలేదు. ఈ కల అంటే మీ జీవితంలోని అన్ని కష్టాలు త్వరలో ముగియబోతున్నాయి. మీ స్వంత మరణం గురించి కలలు వస్తే.. మీరు చాలా కాలం జీవించబోతున్నారని అర్థం. మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. అయితే, మీరు ఈ కలను మరొకరికి చెప్పినట్లయితే, దాని ప్రభావం తగ్గుతుంది.

పూల తోట కల

కలలో పూల తోటను చూస్తే మంచిదని భావిస్తారు. ఈ కల జీవితంలో గొప్ప వార్తలను సూచిస్తుంది. ఇది రాబోయే ఆర్థిక శ్రేయస్సు వైపు కూడా సూచిస్తుంది. మీ కలలో పూల తోటను చూడటం అంటే మీ సంపద పెరుగుతుందని అర్థం. అలాగే, మీ గౌరవం పెరుగుతుంది. అయితే, ఈ కలను మీరు మరెవరికీ చెప్పకూడదు. లేందంటే మీ కల నెరవేరదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత గ్రంథాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ ధృవీకరించడం లేదు.

ఇవి కూడా చదవండి:

కడియం శ్రీహరికి జైకొట్టిన రాజయ్య.. కేటీఆర్ సమక్షంలో సయోధ్య.. వివరాలివే!

చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ మూవీ షూటింగ్ అందుకే క్యాన్సిల్ చేశాం

Advertisment
Advertisment
తాజా కథనాలు