Honey Trap: వలపు వల.. అధికారులే ఎర..పాక్‌ హనీట్రాప్‌తో గిలగిల..!

పాక్‌ ఏజెంట్ విసిరిన హనీట్రాప్‌లో చిక్కుకుని రహస్య సమాచారాన్ని లీక్ చేసిన డీఆర్‌డీఓ సైంటిస్ట్‌ ప్రదీప్‌ పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు గుజరాత్‌లోని భుజ్‌లో సరిహద్దు భద్రతా దళం (BSF) కాంట్రాక్టు ఉద్యోగిని పాకిస్థాన్ మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌తో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడన్న వార్త సంచలనంగా మారింది.

New Update
Honey Trap: వలపు వల.. అధికారులే ఎర..పాక్‌ హనీట్రాప్‌తో గిలగిల..!

ముందు వాట్సాప్‌కి 'హై' అంటూ మెసేజ్‌ వస్తుంది.. ఆ వెంటనే సారీ రాంగ్‌ నంబర్‌ అని వాయిస్‌ మెసేజ్‌ రిసీవ్‌ అవుతుంది. ఆ మాటలో ఓ తెలియని మత్తు దాగుంటుంది. ఆ గొంతు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది. రాంగ్‌ నంబరైనా ఎందుకో పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది. అలా మాటామాటా కలుస్తాయి.. చేసే మెసేజీలకు ఆఘమెఘాలపై రిప్లే వస్తుండడంతో అమ్మాయిపై ఇష్టం పెరుగుతుంది. అది కాస్త ఇతర సంబంధాలకు దారి తీస్తుంది. వాయిస్‌ మెసేజీల నుంచి మొదలైన పరిచయం వీడియో కాల్స్ చేసేవరకు వెళ్తుంది. మైమరిపించే హావభావాలతో ముద్దులన్ని ఒలకబోస్తుంటే మనకోసమే పుట్టిన దేవకన్యలా ఫీల్‌ అవుతారు..అక్కడ నుంచి అసలు గేమ్‌ మొదలవుతుంది. ఎవరి బతుకైనా బస్టాండ్‌ అవ్వడానికి ఓ చిన్న వీక్‌నెస్‌ చాలు. కొందరి మగాళ్లలో ఉండే ఆ వీక్‌నెస్‌పైనే పాకిస్థాన్‌ అస్త్రశస్త్రాలను వదులుతోంది. పాక్‌ ఉపయోగిస్తున్న ఆ ఆయుధామే హనీట్రాప్‌..! పాక్‌ మహిళ వలపు వలలో చిక్కుకున్న డీఆర్‌డీఓ సైంటిస్టు ఎపిసోడ్‌ ఓవైపు ప్రకంపనలు సృష్టిస్తుండగానే తాజాగా బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగి దేశ రహస్య సమాచారాన్ని పాక్‌ మహిళతో పంచుకున్నడన్న వార్త ఉలిక్కిపడేలా చేసింది.

publive-image నీలేష్

డబ్బులకు అమ్ముడు పోయాడా..?
గుజరాత్‌లోని భుజ్‌లో సరిహద్దు భద్రతా దళం (BSF) కాంట్రాక్టు ఉద్యోగిని పాకిస్థాన్ మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌తో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడన్న వార్త సంచలనంగా మారింది. అతని పేరు నీలేష్‌..ఐదేళ్లుగా భుజ్‌ BSF ఆఫీస్‌లోని ఎలక్ట్రికల్‌ డపార్ట్‌మెంట్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. కొద్దీ కాలం క్రితం ఓ మహిళతో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. తన పేరు అదితి అని.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా నీలేష్‌తో స్నేహం చేసింది. నీలేష్‌కి కావాల్సినప్పుడు వీడియో కాల్స్ చేస్తుండేది. అలా ఇద్దరు చాలా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి ఆరా తీసింది అదితి. తనకు డేటా కావాలని అడిగింది. బీఎస్ఎఫ్ భవనాల్లో విద్యుదీకరణ పనుల డాక్యుమెంట్స్‌ షేర్‌ చేయాలని కోరింది. అందుకు నీలేష్‌కి యూపీఐ ద్వారా మనీ కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆమె అడిగిన విధంగానే అతను పత్రాలను పంపాడు. ఇటివలి కాలంలో నీలేష్‌ ప్రవర్తనలో తేడాను గమనించిన ఆఫీసర్లు అతని ఫోన్‌ని చెక్‌ చేయడంతో అసలు విషయం బయటపడింది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళానికి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఏటీఎస్‌ నీలేష్‌ని అరెస్ట్ చేసింది. నీలేష్‌పై నేరపూరిత కుట్ర, అధికారిక రహస్యాల చట్టం కింద ఐపీసీ సెక్షన్ 121, సెక్షన్ 120-బీ కింద కేసులు నమోదు చేశారు.

publive-image ప్రదీప్(లెఫ్ట్), ప్రతీకాత్మక చిత్రం( రైట్)

డీఆర్‌డీఓ సైంటిస్ట్ ఘనకార్యం:
గత మే 3న డీఆర్డీవో సైంటిస్టు ప్రదీప్ కురుల్కర్ అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాలను పాకిస్థాన్‌కు అందించాడు ప్రదీప్‌. మరో ఆరు నెలల్లో రిటైర్ కావాల్సి ఉన్న ప్రదీప్‌కి ఏడాది క్రితం జరా దాస్ గుప్తా అనే ఓ మహిళ పరిచయమైంది. బ్రిటన్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నానంటూ స్నేహం చేసింది. పోర్న్‌ వీడియోలు, న్యూడ్‌ కాల్స్‌తో ప్రదీప్‌కి చాలా చేరువైంది. ఆమె వలపు వలలో చిక్కుకున్న ప్రదీప్‌..తానోక సైంటిస్ట్‌ని అన్న విషయం మరిచాడు.. నిత్యం ఆమె మాయలోనే తేలిపోయేవాడు. నిత్యం వీడియో కాల్స్‌ చేసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుండేవాడు. అలా నిదానంగా ప్రదీప్‌కి దగ్గరైన జరా దేశ రహస్య సమాచారాన్ని ఛాటింగ్‌ మధ్యలో అడిగేది. అప్పటికైనా తాను తప్పు చేస్తున్నానని తెలుసుకోలేకపోయాడు ప్రదీప్‌. ఆమె యక్షిని తరహా క్యారెక్టర్‌ అన్న విషయాన్ని గమనించలేకపోయే అంతలా మైకంలో మునిగిపోయాడు..

ఛార్జ్‌షిట్‌లో నివ్వెరపోయే నిజాలు:
రెండు నెలల క్రితం ప్రదీప్‌ని అదుపులోకి తీసుకోని దర్యాప్తు చేసిన పోలీసులకు మైండ్‌ పోయే సమాధానాలు చెప్పాడు నిందితుడు. క్లాసిఫైడ్ డిఫెన్స్ ప్రాజెక్టులోని భారత క్షిపణి వ్యవస్థల గురించి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో చాట్ చేసినట్లు తెలిపాడు. మహారాష్ట్ర ఏటీఎస్ కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఆఖరికి దేశానికి చెందిన ఆయుధాల సమాచారం కూడా లీక్ చేశాడు. బ్రహ్మోస్, లాంచర్లు, మిలిటరీ బ్రిజ్దింగ్ సిస్టమ్.. ఇలా ప్రతి విషయాన్ని ఆమెతో పంచుకున్నాడు. అసలు ఓ మహిళ ఈ విషయాలను ఎందుకు అడుగుతుందన్న కనీస విచక్షణ కూడా లేకుండా తన దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని ఆమెకు చెప్పడం పట్ల ఏటీఎస్‌ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఆ వలపు లేడీ ఐపీ అడ్రస్‌ ట్రాక్‌ చేస్తే ఆమె పాకిస్థాన్‌ నుంచే ఛాట్ చేసినట్టు కూడా తేలింది. ఇటు దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాటింగ్‌ కూడా ఏటీఎస్‌ దగ్గర ఉంది.

ఇద్దరి మధ్య సంభాషణ:

జరా: బేబ్ నేను ఇప్పుడే చూశాను, మీరు దానిపై పని చేస్తున్నారా?
కురుల్కర్: అవును, నేను SAMలో కూడా పని చేస్తున్నాను
జరా: ఇది ఎప్పుడు అయిపోతుంది బేబ్?
కురుల్కర్: రాబోయే కొద్ది వారాల్లో.
జరా: మీరు సైన్యానికి లేదా వైమానిక దళానికి ఇస్తారా?
కురుల్కర్: ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రెండూ.
జరా: ట్రయల్స్ ముగిశాయా?
కురుల్కర్: నిన్న రాత్రి పేలుడు సంభవించింది
జరా: మీరు విజయవంతమయ్యారా?
కురుల్కర్: అవును

మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ లింక్‌ను జరాతో పంచుకున్న ప్రదీప్‌ కురుల్కర్:

జరా: వావ్, కొత్త ప్రాజెక్ట్?
కురుల్కర్: అవును
జరా: మీరు పంపిన లింక్ ఏంటి?
కురుల్కర్: డ్రోన్ల గురించి
జరా: మీ డ్రోన్ సిస్టమ్‌ని నేను చూడాలనుకుంటున్నాను..
కురుల్కర్: ఓకే

బ్రహ్మోస్ గురించి:

జరా: నువ్వు బ్రహ్మోస్‌కి కూడా పని చేశావా?
కురుల్కర్: నా దగ్గర ప్రాథమిక డిజైన్ నివేదికలు ఉన్నాయి
జరా: బేబీ, ఇది ఎయిర్ లాంచ్ వెర్షన్ కదా, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నామా?
కురుల్కర్: అవును

ఇలా ఒకటేంటి.. దేశ రక్షణకు సంబంధించిన ప్రతి విషయం గురించి పాక్‌ స్పై ప్రదీప్‌ ద్వారా తెలుసుకుంది. ఇక యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రదీప్‌పై 1837 పేజీల ఛార్జిషీటు తయారు చేసింది. 1923 అధికారిక రహస్యాల చట్టంలో ప్రకారం కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కి చెందిన రవి చౌరాసియా హానీట్రాప్‌లో చిక్కుకొని దశ రహస్యాలన్ని అమ్మేశాడు. ఇప్పుడు డీఆర్‌డీఓ సైంటిస్ట్‌తో పాటు మరో బీఎస్‌ఎఫ్‌ ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగి కూడా దొరకడంతో ముందుముందు ఈ హానీట్రాప్‌ లిస్ట్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు