రూ.54,000 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అప్లై చేసుకోండిలా..!

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుంచి కొత్త నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. DRDO రీసెర్చ్ అసోసియేట్, DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ కోసం డీఆర్‌డీఓ ప్రస్తుతం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

New Update
రూ.54,000 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అప్లై చేసుకోండిలా..!

DRDO Jobs ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు(central government jobs) ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు.. అందులోను రక్షణశాఖ అంటే మరింత క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే బీటేక్‌(BTech) చదివిన వాళ్లకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌ల రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌(Notification)ను విడుదలచేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

DRDO రిక్రూట్‌మెంట్ వివరాలు:
◙ మొత్తం ఖాళీలు: 55 పోస్టులు

◙ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'F': 1 పోస్ట్

◙ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'డి': 12 పోస్ట్‌లు

◙ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'సి': 30 పోస్ట్‌లు

◙ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'బి': 12 పోస్ట్‌లు

అర్హతలు:
దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందేందుకు, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయో పరిమితి:
➡ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'F' కోసం: 55 సంవత్సరాలకు మించకూడదు

➡ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'D' కోసం: 45 సంవత్సరాలకు మించకూడదు

➡ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'C' కోసం: 40 సంవత్సరాలకు మించకూడదు

➡ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'B' కోసం: 35 సంవత్సరాలకు మించకూడదు

పే స్కేల్:
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'ఎఫ్': రూ. 2,20,717

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'డి': రూ. 1,24,612

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'సి': రూ. 1,08,073

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 'బి': రూ. 90,789

దరఖాస్తు ఫీజ్:
జనరల్, OBC, EWS పురుష అభ్యర్థులు: రూ.100

SC/ST/దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులు: నో ఫీజ్

ఎలా దరఖాస్తు చేయాలి:
⦿ rac.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

⦿ హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి

⦿ మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేసుకోండి

⦿ లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయండి

⦿ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి

⦿ దరఖాస్తు రుసుము చెల్లించండి

⦿ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి..తర్వాత ప్రింటవుట్ తీసుకోండి

శాలరీ:

I) DRDO రీసెర్చ్ అసోసియేట్: DRDO నిబంధనల ప్రకారం రూ.54000 ప్లస్ HRA.

II) DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో: DRDO నిబంధనల ప్రకారం రూ.31000 ప్లస్ HRA.

Advertisment
Advertisment
తాజా కథనాలు