/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mohan-yadav-jpg.webp)
Madhya Pradesh New CM Mohan Yadav: డాక్టర్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎన్నికుంది బీజేపీ (BJP) హైకమాండ్. 2013లో ఉజ్జయిని దక్షిణ్ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు . 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయన మరోసారి ఎన్నికై ఉజ్జయిని దక్షిణ్ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 2, 2020న శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
13 हजार से अधिक वोट की ये जीत पूरी विनम्रता के साथ मेरे क्षेत्र के हर व्यक्ति को, हर लाड़ली बहना को, भाजपा के हर देवतुल्य कार्यकर्ता को और भाजपा के संगठन को समर्पित है।
असीम स्नेह, अपार प्रेम और आशीर्वाद देने के लिए सभी का शुक्रिया, धन्यवाद, आभार।आपका अपना
डॉ मोहन यादव… pic.twitter.com/Yeyiea2QTW— Dr Mohan Yadav (@DrMohanYadav51) December 3, 2023
హ్యాట్రిక్ ఎమ్మెల్యే:
1965 మార్చి 25న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించిన మోహన్ యాదవ్ ఎన్నో ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఇటు పొలిటికల్‌గా అటు వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. 2013లో ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. అప్పటినుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నినూ గెలిపొందారు. నాటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జులై 2, 2020న క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవలి 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమనారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్‌ని బీజేపీ హైకమాండ్ సీఎంగా ప్రకటించింది. మాల్వా ఉత్తర ప్రాంతంలో భాగంగా ఉజ్జయిని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం 2003 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది.
Also Read: వాయనాడ్ లో రైతును చంపిన పులి…దాన్ని చంపాలన్న ప్రభుత్వం