Hyderabad: డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన 17 మంది జీవిత ఖైదీలు.!

చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న 17 మంది జీవిత ఖైదీలు డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవంలో వారికి డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశారు. జైల్లో ఉంటూ పట్టాలు పొందడంపై నెటిజన్లు అభినందిస్తున్నారు.

New Update
Hyderabad: డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన 17 మంది జీవిత ఖైదీలు.!

Ambedkar Open University 25th convocation: క్షణికావేశంలో చాలా మంది వివిధ నేరాల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తుంటారు. వారిలో కొంత మంది రకరకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేస్తుంటారు. అలాంటి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు జైల్లో ఉండి విద్యను అభసించే అవకాశాన్ని కల్పస్తూ ఉంటారు జైలు శాఖ అధికారులు. తాజాగా, ఈ అవకాశాన్ని సధ్వీనియోగం చేసుకున్నారు 17 మంది జీవిత ఖైదీలు. మారు మనస్సు పొంది జైల్లో ఉంటూనే డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు.

Also read: ‘మ్యారేజీ స్టార్ పవన్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడు’.. జనసేనానిపై జగన్ కౌంటర్లు.!

డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ(BRAOU) 25వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ (M Jagadeesh Kumar) హాజరైయ్యారు. 43 మంది విద్యార్ధులకు బంగారు పతకాలు అందజేశారు. 17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా  జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న 17 మంది జీవిత ఖైదీలు (Prisoners) బీఏ, పీజీలో సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ లో పట్టాలు పొందినట్టు తెలిపారు. డిగ్రీ, పీజీ పట్టాలు (Degree/PG Certificates) పొందిన ఖైదీలను అభినందించారు.

Also Read: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్..బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా

యూనివర్సిటీ వీసీ సీతారామారావు మాట్లాడుతూ..డిగ్రీలో 20,972 మంది, పీజీలో 10, 757 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, వీరందరికీ పట్టాలు ప్రదానం చేశామని తెలిపారు. వీరిలో 17 మంది ఖైదీలు ఉన్నారని, డ్రైవర్లు, గృహిణిలు డిగ్రీలు పొందడం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ 76 ఏండ్ల వయసులో పీహెచ్‌డీ సాదించారని తెలిపారు. నేటి తరంలో వీరు అందరికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు