Double bed room issue: డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపకంలో గందరగోళం..ఆ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు

డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపకంలో గందరగోళం నెలకొంటుంది. కారాలు, మీరియాలు దువ్వుతున్నారు పాత, కొత్త లబ్దిదారులు. పాత్రికేయులతో డబుల్ బెడ్‌రూమ్‌ తిప్పలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ ఎమ్మెల్యేల అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్స్ గొడవ కొనసాగుతూనే ఉండగా నగరంలో జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీ అని గోడ వ్రాతలతో తూర్పులో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

New Update
Double bed room issue: డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపకంలో గందరగోళం..ఆ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం నియోజకవర్గం ఎమ్మెల్యేలకు తలనొప్పులు తీసుకువస్తుంది. గతంలో డబుల్ బెడ్ రూమ్స్ పట్టాలు పొందిన లబ్దిదారులు ప్రస్తుతం పొందిన లబ్దిదారులతో పంచనూ లేక ఉంచుకోనులేక స్థానిక ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు. శాసనసభ ఎన్నికలు ముంచుకు రావడంతో డబుల్ బెడ్ రూమ్స్ పంపకాలపై స్థానిక నాయకులతో అధికారులతో ఎమ్మెల్యేలు కుస్తీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా(warangal district)లో డబుల్ బెడ్ రూమ్స్(Double bed room) పంచాయితీ ఎమ్మెల్యేల అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరంగల్ తూర్పులో డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ చినికి చినికి గాలివానగా మారి ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌(KTR) ప్రారంభించకుండా పరిస్థితి రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు నగర ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది.

కొత్త రచ్చకు దారితీస్తున్న పంపిణీ:
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేద ప్రజలకోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ విభిన్న పంచాయితీలకు దారి తీస్తోంది. ఇటీవల డబుల్ బెడ్ రూమ్స్ లబ్దిదారులకు పంచడానికి వచ్చిన ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీర్ పంచకుండా వెనుతిరగడంతో లబ్దిదారుల్లో విభిన్న అను మానాలు రేకెత్తుతున్నాయి. అన్నీ రెడీ అయ్యాక కూడా డబుల్ బెడ్ రూమ్స్ పట్టాలు లబ్దిదారులకు అందకపోవ డంతో సామాన్య ప్రజలు అయోమయానికి లోనియ్యారు. డబుల్ బెడ్ రూమ్స్ పంచి ప్రతిపక్షాలు నోరు మొయించ వచ్చన్న ఎమ్మెల్యే వ్యూహం విఫలం కావడం అహంకారా ని అంటున్నారు. ఇండ్లు వస్తాయా లేదా లేక స్థానికేతరులకు ఇస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని యేండ్ల నుండి ఎదురు చూస్తున్నామని ఇప్పుడు ఎవరికో ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుందని పని పాట వదిలి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చుట్టు తిర గాల్సి వస్తుందని అంటున్నారు. అధికార పార్టీ అనుచరు లకు కార్యకర్తలకు రహస్యంగా పట్టాలు ఇస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయని అలా జరిగితే ఇంటికోసం. పోరాటం చేయడానికి వెనకాడమని హెచ్చరిస్తున్నారు.

డబుల్ మోసమే:
డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ కరువుమంటే కప్పకు కోపం వదులు అంటే పాముకు కోపం అన్నట్టుగా అధికార పార్టీ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న లబ్దిదారులతో ప్రస్తుత లబ్దిదారులతో ఎలా సయోధ్య కుదురుతుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పాత కొత్త లబ్దిదారులకతో కుడిదిలో పడ్డ ఎలుకలా ఎమ్మెల్యే పరిస్థితి మారిందని అధికార పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో తాము ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్స్ నిజాయితీగ పేద ప్రజలకు పంచామని ఇప్పుడు వారికి కాదని అధికార పార్టీ ఎమ్మెల్యే తన అనుచరులకు కార్యకర్తలకు ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. మా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ స్థానికంగా ఇండ్లు లేని మాకే ఇవ్వాలని ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఉంటామంటే ఊరుకునేది లేదని స్థానికుల నుండి డిమాండ్ రావడం మరో పంచాయితీకి ఆజ్యం పోసినట్టు అవుతుంది. మొత్తానికి డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ లబ్దిదారులకే కాకండా ఏకంగా ఎమ్మెల్యేకే అసలుకే మోసం జరిగేలా ఉందని రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జర్నలిస్టులకు ఇండ్లు..!
డబుల్ బెడ్ రూమ్స్ గొడవ కొనసాగుతూనే ఉండగా నగరంలో జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీ అని గోడ వ్రాతలతో తూర్పులో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. గత రెండు రోజులుగా నీకచ్చాయా నౌకచ్చాయా అని ఒకరికి తెలియకుండా మరొకరు సమాచారం. సేకరిస్తూ ఎవరికీ వారే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంఘ నాయకులకు సీనియర్ పాత్రికేయులకు తెలియకుండా తూర్పులో డబుల్ బెడ్ రూమ్స్ ఎప్పుడు పంపకం చేశారో అర్ధం కావడం లేదంటున్నారు. ఇప్పటికే జర్నలిస్తుల పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఆరు మాసాలు వస- పంపకాలు చేయక పోయేసరికి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల లోపు వస్తాయా లేదా అనే అనుమానం ఒక వైపు ఉంటే జూనియర్స్ కు కొత్తగా వచ్చిన వారికీ, ఎమ్మెల్యే అనుంగ అనుచరులకు ముందు ప్రియారిటీ ఉందని రెండు దశాబ్దాలుగా కలం పట్టిన కార్మికుల పేరు లిస్టులో లేదన్న ప్రచారం మరో వైపు సాగుతుంది.

ALSO READ: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు