Cheating: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆగని మోసాలు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో దళారులు, కేటుగాళ్లు చేరి సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నిరుపేదలను మోసం ఘటన హైదరాబాద్ రహమత్ నగర్‌లో వెలుగు చూసింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేసిన స్థానిక నాయకుడిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. By Trinath 04 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి నిరుపేదల సొంతింటి కల నేరవేర్చాలని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథాకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని అడ్డంగా పెట్టకుని చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నిరుపేదలను మోసం ఘటన హైదరాబాద్ రహమత్ నగర్‌లో వెలుగు చూసింది. బాధితులు మీడియా ముందుకు రావడంతో ఈ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేసిన స్థానిక నాయకుడి వివరాలను మీడియాకు చెప్పారు బాధితులు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్ ఉపేందర్ రెడ్డి దగ్గర తమ బాధను చెప్పుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందించారు. గతంలోనూ ఇదే తరహా ఘటనలు: ఇలా డబుల్ బెడ్‌రూమ్ విషయంలో జరుగుతున్న మోసాలు ఈనాటివి కాదు. గతంలోనూ అనేక సార్లు ఇదే తరహా ఘటనులు జరిగాయి. గృహ నిర్మాణ శాఖలో తనకు తెలిసిన వాళ్లు ఉన్నారని.. చాలా సులువుగా డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ మభ్యపెట్టి లక్షలు దోచేసుకుంటారు. తీరా డబ్బులు కట్టిన తర్వాత బాధితులను తమ చుట్టూ తిప్పుకుంటారు. తిరిగి తిరిగి వేసారి పోయే బాధితులు తాము మోసపోయినట్టు గ్రహించేలోపే ఆ డబ్బులు ఆవిరైపోతాయి. తలలుపట్టుకుంటున్న నేతలు: మరోవైపు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం అధికార బీఆర్‌ఎస్ నేతలను టెన్షన్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. పేదల సొంతింటి కల తీర్చా లన్న ప్రభుత్వ ప్రయత్నం క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. దశలవారీగా ఇళ్ళ నిర్మాణాల లక్ష్యాన్ని నిర్ధేషించుకుని చిరకాల వాంఛను తీర్చాలన్న వ్యూహం ఎప్పటికప్పుడు రాజకీయ రంగు పులుము కుంటోంది. 2018 ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ఫలించిందని చెప్పాలి. అయినా పూర్తిగా సక్సెస్ కాలేదన్న ఆరోపణలున్నాయి. అసలే ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుంటే.. జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఈ పంచాయతీలు అంతటితో ఆగకుండా ఆయా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు చుట్టుకుంటున్నాయి. పలుమార్లు ప్రభుత్వాధినేత వద్ద కూడా ఇందుకు సంబంధించిన పంచాయతీలు జరిగాయి. అయినా సమస్యకు పరిష్కార మార్గం దొరకడం లేదు. రాష్ట్రంలో 27లక్షల మందికి సొంతిళ్లు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి