Jai Sri Ram : భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీరామ నవమి(Sri Rama Navami) పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహించేందుకు భక్తులు(Devotes) ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పర్వదినాన కొన్ని చేయకూడని, చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం రోజున ఉపవాసం(Fasting) ఉండే వారు కొన్ని తప్పక పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం..
నవమి నాడు చేయాల్సిన పనులు:
శ్రీరామ నవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందు గానే నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఇంటిని పూల దండలు, పచ్చని తోరణాలతో అలంకరించుకోవాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత సీతాలక్ష్మణ హనుమంత సమేతంగా ఉన్న రాముల వారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. పూజ సమయంలో శ్రీరాముడిని అష్టోత్తర శతనామావళి జపిస్తూ పూజ చేయాలి.
శ్రీరాముల వారికి ఎంతో వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పవిత్ర రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈరోజంతా రామ నామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడం వల్ల అత్యంత పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
రోజంతా ఉపవాసం ఉండే వారు శరీరంలోని నీటి శాతం తగ్గకుండా మంచినీళ్లు, కొబ్బరి నీరు(Coconut Water), పండ్ల రసాలు(Fruit Juice) వంటి పానీయాలను సేవించవచ్చు. అంతేకాకుండా.. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని కొన్ని తాజా పండ్లను, కూరగాయలను, నట్స్, పాల ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
శ్రీరామ నవమి నాడు చేయకూడని పనులు:
ఎంతో ప్రత్యేకమైన ఈరోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈరోజున మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు. అంతేకాకుండా చాలా మంది సెలవు కదా అని జుట్టు కత్తిరించుకుంటు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజున మాత్రం అలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈరోజున ఎంతో సౌమ్యంగా ఉండాలి.. ఎవరితోనూ గొడవలు పడకూడదు, అబద్దాలు ఆడకూడదని పండితులు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజున తినే ఆహారంలో అల్లం, వెల్లుల్లిని కూడా వాడకుండా ఉండడం మంచిది. అంతే కాకుండా ఉపవాసం ఉన్న వారు దానిని విరమించిన తరువాత ఎక్కువ ఉప్పు, కారం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఉపవాసం తరువాత ఒకేసారి ఉప్పుకారాలు తీసుకుంటే అవి జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశాలుంటాయి. అందుకే ఉపవాసం తరువాత ఎక్కువ ఉప్పు కారాలు తీసుకోకూడదు.
Also read: డయాబెటిస్ ఉన్న వారు నేరెడు పండ్లను ఇలా వాడాలి… ఆకుల నుంచి గింజల వరకు ప్రతి ఒక్కటి !